అంబటి.. కాపులపై ఆ వ్యాఖ్యలు ఏమిటి?

నేతలు తమ ఇష్టానుసారం మాట్లాడడం తరువాత నాలుక కరుచుకోవడం పరిపాటే. అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్న సామెత లాగా వైసీపీ నేత అంబటి రాంబాబు ఇటీవల ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాపులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కాపులు తాగుబోతులు, మాంసం ఎక్కువ తింటారు, ఆవేశపరులు అంటూ నోరు జారారు. దీంతో సొంత సామాజిక వర్గానికి చెందిన వారి కోపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ఆయన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. […]

Written By: Raghava Rao Gara, Updated On : June 27, 2021 3:16 pm
Follow us on

నేతలు తమ ఇష్టానుసారం మాట్లాడడం తరువాత నాలుక కరుచుకోవడం పరిపాటే. అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్న సామెత లాగా వైసీపీ నేత అంబటి రాంబాబు ఇటీవల ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాపులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కాపులు తాగుబోతులు, మాంసం ఎక్కువ తింటారు, ఆవేశపరులు అంటూ నోరు జారారు.

దీంతో సొంత సామాజిక వర్గానికి చెందిన వారి కోపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ఆయన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. సొంత సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడడంపై రాంబాబు క్షమాపణలు చెప్పారు. ఇప్పటికే రాంబాబుపై పలు ఆరోపణలు ఉన్నాయి. నోటిదురుసు తనం ఎక్కువగా ఉంటుందని సొంత పార్టీనేతలే చెబుతుంటారు.

గతంలో కూడా అనేకసార్లు పలువురు నేతలపై నోరు జారిన సందర్భాలు ఉన్నాయి. జగన్ మెప్పు పొందడం కోసమే ఇలా చేశారని పలు కామెంట్లు వచ్చాయి. మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న రాంబాబు అదను కోసం వేచి చూసే సందర్భంలోనే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అధినేత మెప్పు కోసం ప్రయత్నించే సందర్భంలో కాపులపై దూషణలకు దిగడం వారికి ఆవేశం తెప్పించింది.

అయితే రాంబాబు తాజా వ్యాఖ్యలపై చింతిస్తూ మరో వీడియో విడుదల చేశారు. తాను యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తన కులపు సోదరులను బాధించినట్లు ఉంటే క్షమించాలని కోరారు. ఆ సమయంలో అలా అని ఉండకూడదని పశ్చాత్తాప పడ్డారు. కాపులందరికి తన తరఫు నుంచి బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని వ్యాఖ్యానించారు.