Allegations Against Two Gavernment Teachers: ఆచరించి చెప్పేవాడే ఆచార్యుడు అని మన జాతిపిత చెప్పారు. ఉపాధ్యాయుడంటే భావి భారత పౌరులను తయారు చేయాల్సి ఉంటుంది. కానీ అతడే దారి తప్పితే. ఇక విద్యార్థుల పరిస్థితి ఏంటి. సమాజంలో ఉన్నతమైన విలువలు కలిగిన స్థానంలో ఉండి కూడా పాడు పని చేసి అందరితో ఛీ అనిపించుకున్నాడు. గ్రామస్తుల సమక్షంలోనే తలవంపులు తెచ్చుకున్న ఉపాధ్యాయుడిపై అందరు శాపనార్థాలు పెట్టారు. చివరకు ఊరు విడిచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

విద్యాలయమంటే దేవాలయమే. బడిని గుడితో పోల్చి పవిత్రంగా చూసుకుంటారు. అలాంటి పవిత్రమైన చోట అపవిత్రమైన పని చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. సభ్య సమాజం తల దించుకునేలా ఉపాధ్యాయులే వివాహేతర సంబంధం కొనసాగిస్తూ పట్టుబట్టారు. రాజస్తాన్ రాష్ట్రంలోని జోథ్ పూర్ రూరల్ లోని లుని ప్రాంతంలో సలావాస్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ బాగోతం జరిగింది.
Also Read: ఉక్రెయిన్ కు ఊతమిచ్చే దేశాలేవి? రష్యాకు భయపడేనా?
కొద్ది కాలంగా ప్రధానోపాధ్యాయుడు, మరో ఉపాధ్యాయురాలి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. పాఠశాల నిర్వహించే సమయంలోనే వారిద్దరు రాసలీలలు సాగించడం పరిపాటిగా మారింది. దీంతో అందరు ఆశ్చర్యపోయేవారు. దీనికి తోడు సదరు ప్రధానోపాధ్యాయుడు పాఠశాల వెనకాల గది అద్దెకు తీసుకోవడంతో వారికి సమయం దొరికినప్పుడల్లా గదిలోకి వెళ్లి కోరికలు తీర్చుకునేవారు.
ఈ తతంగం కొద్ది రోజులుగా సాగుతుండటంతో వీరి ఏకాంత సమయాన్ని గమనిస్తూ వస్తున్నారు. గ్రామస్తులు కూడా వీరి వ్యవహారాన్ని గమనిస్తూ వస్తున్నారు. దీంతో వీరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని పథకం పన్నారు. ఈ నేపథ్యంలో వీరు ఏకాంతంగా గడుపుతున్న సమయంలో బయట నుంచి గొళ్లెం పెట్టి అందరిని పిలిచారు. దీంతో వివాహేతర బంధం కాస్త బహిర్గతం అయింది.

ఊరంతా ఛీ అన్నారు. విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సిన వారే బరితెగించడంతో గ్రామస్తులు వీరి గురించి ఎమ్మెల్యేకు సైతం ఫిర్యాదు చేశారు. వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని విద్యాశాఖాధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పడంతో గ్రామస్తులు శాంతించారు. దీనికి కారణమైన ఉపాధ్యాయులు ఊరు విడిచి వెళ్లిపోవడం గమనార్హం.
Also Read: ఆ ప్రాంతంలో పవన్ ఫ్యాన్స్ గొడవ.. రానా ఫ్యాన్స్ ఆందోళన