RRR Shooting in Ukraine: ఎంతో అందమైన ప్రదేశాలకు నెలవైన ఉక్రెయిన్‌లో గతంలో ఎన్నో భారత చిత్రాలు షూటింగ్ జరుపుకున్నాయి. తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీలోని పలు సన్నివేశాలతోపాటు నాటు నాటు సాంగ్‌ను కూడా ఉక్రెయిన్‌లోని ప్యాలెస్‌లోనే చిత్రీకరించారు. అలాంటి ఉక్రెయిన్ ఇప్పుడు యుద్ధంలో చిక్కుకుని ఇప్పుడు పడుతుంది.

అన్నట్టు రజనీకాంత్ రోబో 2.0, సాయిధరమ్ తేజ్ విన్నర్, ఏఆర్ రెహమాన్ సహ నిర్మాతగా వ్యవహరించిన 99 సాంగ్స్, కార్తీ నటించిన దేవ్ చిత్రాల్లోని పలు సన్నివేశాలు, పాటలను ఉక్రెయిన్‌లోనే చిత్రీకరించారు. అందుకే, ఉక్రెయిన్ తనకు ఎక్కువ ఇష్టం అని రాజమౌళి కూడా చెప్పిన సంగతి తెలిసిందే.
Also Read: ఉక్రెయిన్ కు ఊతమిచ్చే దేశాలేవి? రష్యాకు భయపడేనా?
ఇంతకీ.. రాజమౌళి ఏమి మాట్లాడాడు అంటే.. రాజమౌళి మాటల్లోనే.. ‘నాకు అక్కడ లొకేషన్స్ నాకు చాలా బాగా ఇష్టం. ముఖ్యంగా మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి అక్కడ. మా సినిమాలోని ఇద్దరు హీరోలు చేసిన పాత్రలను ఎలివేట్ చేసే సీన్స్ ను అక్కడే చేశాను అని చెప్పాడు.
కాగా అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ల పాత్రల్లో ఏ పాత్ర ఎక్కువ ఇష్టం అంటే మాత్రం.. చరణ్ చేసిన అల్లూరి సీతారామరాజు పాత్ర ఒకింత ఎక్కువ ఇష్టం. ఆ పాత్రలో ఎమోషన్ బాగుంటుంది’ అని రాజమౌళి చెప్పుకొచ్చాడు. ఇక చరణ్ అభిమానులు అయితే, ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏది ఏమైనా అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ అంటేనే గొప్ప దేశభక్తులు.

మరి వారి పాత్రల్లో ఇద్దరు మాస్ హీరోలు.. పైగా వారికి ప్రేమకథలు. అల్లూరి, కొమురం భీమ్ నుండి ప్రేక్షకులు దేశభక్తినే కోరుకుంటారు. దేశ భక్తితో పాటు ప్రేక్షకుడిని మెప్పించటానికి అన్ని కమర్షియల్ అంశాలను జోడించాలి. మరి సినిమాని ఎలా హ్యాండిల్ చేశారో చూడాలి.
మరో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ మరో కీలక పాత్రలో కనిపించబోతుండటంతో.. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
Also Read: ఆ ప్రాంతంలో పవన్ ఫ్యాన్స్ గొడవ.. రానా ఫ్యాన్స్ ఆందోళన
