All England open : ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ లో డబుల్ స్టాప్ జోడి సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి వారి మీదనే భారత్ ఆశలు పెట్టుకుంది. వీరు మాత్రమే సీడెడ్ ప్లేయర్లు.. మిగతా వారంతా అన్ సీడెడ్ గా రంగంలోకి దిగుతున్నారు. మరోవైపు ఈ టోర్నీలో మన వాళ్లు గొప్ప ప్రదర్శన చేస్తారని ఎవరూ భావించడం లేదు. స్టార్ షట్లర్ పీవీ సింధు గాయం నుంచి కోలుకున్నప్పటికీ.. ఆమె ఫామ్ లో లేకపోవడం ఇబ్బంది కలిగిస్తోంది.. హెచ్ ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్ కూడా ఒకప్పటిలాగా ఆడలేక పోతున్నారు. సాత్విక్ తన తండ్రిని కోల్పోవడంతో తీవ్రమైన దుఃఖంలో ఉన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అతడు గొప్పగా ఆడతాడని ఎవరికీ పెద్దగా ఆశలు లేవు. తొలి రౌండులో కిమ్ గా ఉన్(కొరియా) తో సింధు, రెండో సీడ్ మిన్ యో(సింగపూర్) తో మాళవిక బాన్సోడ్ తలపడనుంది. ఇక పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్లో కోకి వతన బె (జపాన్) తో లక్ష్యసేన్ పోటీ పడుతున్నాడు. ఈ మ్యాచ్ లో కనుక లక్ష్య సేన్ గెలిస్తే.. ప్రీ క్వార్టర్స్ లో మూడో సీడ్ జోనాథన్ క్రిస్టీ తో అతడు పోటీ పడాల్సి ఉంటుంది. టోమా జూనియర్ పొపొవ్(ప్రాన్స్) తో ప్రణయ్ తలపడాల్సి ఉంటుంది.
Also Read : ఏడాదిపాటు మ్యాగి తిని బతికిన అతడే.. నేడు స్టార్ క్రికెటర్
డబుల్స్ లో..
డబుల్స్ విభాగంలో డెన్మార్క్ ప్రాంతానికి చెందిన డేనియల్ – మ్యాడ్స్ వెస్టర్ గాడ్స్ తో ఏడవ సీడ్ సాత్విక్ – చిరాగ్ జోడి, చైనీస్ తైపీ జోడి తో వరల్డ్ నెంబర్ 9 ర్యాంక్ లో ఉన్న ట్రీసా జాలీ – గాయత్రి తలపడతారు. అశ్విని పొన్నప్ప – తనషా క్యాస్ట్రో, ప్రియాంక – శృతిమిశ్రా తలపడతారు. మిక్స్ డ్ విభాగం లో రోహన్ కపూర్ – రిత్విక శివాని, ధ్రువ కపిల – తనీషా, సతీష్ – ఆద్య జోడి కూడా బరిలో ఉన్నారు. ఇక ఈ టోర్నీలో ఆడేందుకు పీవీ సింధు ఇంగ్లాండ్ చేరుకుంది. అక్కడికి వెళ్లడానికి ప్రైవేట్ జెట్ లో ప్రయాణించింది. తన సహాయక సిబ్బందిని కూడా ఇందులోనే తీసుకెళ్లింది. ఇదే విషయాన్ని పీవీ సింధు(PV Sindhu ) స్వయంగా తన ఇన్ స్టా గ్రామ్ లో వెల్లడించింది. జెట్ లో తన ఎక్కుతున్న దృశ్యాలను సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. సింధు ఇటీవల వివాహం చేసుకుంది. అంతకు ముందు నుంచే ఆమె కెరియర్ అంతంతమాత్రంగానే ఉంది. ఒలింపిక్స్ లో పెద్దగా సత్తా చాటలేదు. గాయాలు ఆమెను ఇబ్బంది పెడుతున్నాయి. అయితే వివాహం జరిగిన తర్వాత ఆడుతున్న మేజర్ టోర్నీ కావడంతో అందరి ఆశలు మొత్తం సింధు పైనే ఉన్నాయి. అయితే ఆమె ఎంతలా రాణిస్తుందనేది కొద్ది గంటలు గడిస్తే తెలుస్తుంది.
ఇటీవల కాలంలో టీమిండియా స్టార్ షట్లర్లు గొప్పగా ఆడింది లేదు. వరుస గాయాలు ప్లేయర్లను ఇబ్బంది పెడుతున్నాయి . డొమెస్టిక్ లో తేలిపోతున్న భారత షట్లర్లు.. నాన్ డొమెస్టిక్ లో అయితే తొలి రెండు రౌండ్లకే వెను తిరిగి వస్తున్నారు. గాయాలే ఇందుకు కారణమని ప్లేయర్లు పేర్కొంటున్నారు. ఊపిరి సలపని టోర్నీలు కూడా ఇబ్బంది పెడుతున్నాయని వారు వాపోతున్నారు. ఇప్పుడు ఆల్ ఇంగ్లాండ్ టోర్నీలో కూడా టీమ్ ఇండియా షట్లర్ల పై ఎవరికీ పెద్దగా ఆశలు లేవు. ఇలాంటి సమయంలో అంచనాలు లేకుండా బరిలోకి దిగిన టీమిండియా ప్లేయర్లు ఏమైనా అద్భుతం చేస్తారేమోనని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
Also Read : పీవీ సింధు పెళ్లి సందడి.. ఆ అల్లరి చూడతరమా.. వైరల్ పిక్స్