Awara Movie: తమిళ సినిమా ఇండస్ట్రీ స్టార్ హీరోలకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. వాళ్లు నటించిన దాదాపు అన్ని సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించాయి. తమిళ స్టార్ హీరోలకు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన సినిమాలు అన్నీ కూడా తెలుగులో కూడా మంచి సూపర్ హిట్ విజయం సాధించాయి. ప్రస్తుతం హీరో కార్తి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటివరకు కార్తీ నటించిన సూపర్ హిట్ సినిమాలలో ఆవారా సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కార్తీ 2007లో పరిధి వీరం అనే సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత కార్తీ యుగానికి ఒక్కడు, శకుని, చెలియా, దొంగ, ఊపిరి, సర్దార్, పోనియం సెల్వన్ వంటి పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించాడు. యుగానికి ఒకడు సినిమాతో కార్తీ తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం అయ్యాడు. విభిన్నమైన కథతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత కార్తీ నటించిన ఆవారా సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.
తమిళ్ లో పయా టైటిల్ తో వచ్చిన ఈ సినిమా తెలుగులో ఆవారా పేరుతో డబ్ అయ్యింది. తెలుగులో ఆవారా సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో హీరో కార్తీ తో పాటు తమన్న కూడా తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం హైలెట్గా నిలిచింది. సినిమాలోని పాటలన్నీ మంచి హిట్ అయ్యాయి. ఈ సినిమాలో తమన్నా తన అందంతో, నటనతో ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. అయితే ఆవారా సినిమాలో ముందు మరొక హీరోయిన్ అనుకున్నారట. ఆమె మరెవరో కాదు లేడీస్ సూపర్ స్టార్ నయనతార. ఇటీవలే ఈ సినిమా దర్శకుడు లింగస్వామి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆవారా సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
ముందుగా ఆవారా సినిమాలో హీరోయిన్ గా నయనతారను అనుకున్నాము. కానీ కొన్ని అనివార్య కారణాల వలన చివరి నిమిషంలో ఆమె స్థానంలో తమన్నాను తీసుకున్నామని తెలిపారు. అయితే నయనతారకు కథ వినిపించినప్పుడు ఆమె కథ బాగా నుంచి ఓకే కూడా చెప్పారట. కానీ చిత్రీకరణకు ముందు కొన్ని అనివార్య కారణాల వలన నయనతార ఈ ప్రాజెక్టు నుంచి తప్పకుండా అని తెలిపారు. అయితే తమన్నా ఆవారా సినిమా చేసే సమయంలో ఆమె వయసు కేవలం 19 ఏళ్లు మాత్రమే. ఈ సినిమాలో తమన్నా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది అని దర్శకుడు లింగస్వామి చెప్పుకొచ్చారు.
View this post on Instagram