విమాన ప్రయాణాలకు మూడు రాష్ట్రాల అభ్యంతరం!

సోమవారం నుండి దేశంలో విమానాల రాకపోకలకు కేంద్ర పౌరవిమాన శాఖ మంత్రిత్వ శాఖ అంతా సిద్ధం చేస్తున్నా దేశంలోని మూడు పెద్ద రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం తమ రాష్ట్రాలలో విమానాలు తిరగడానికి అభ్యంతరం తెలిపాయి. దానితో విమాన ప్రయాణాలు పాక్షికంగానే జరిగే అవకాశం ఉంటుంది. కరోనా లాక్‌డౌన్‌ విధించిన రెండు నెలల తర్వాత దేశంలో విమానాల రాకపోకలు జరగబోతున్నాయి. దేశంలో పారిశ్రామికంగా పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర, చెన్నైలు కరోనా వైరస్ ఇంకా కట్టడి కాకపోవడంతో ఇప్పట్లో విమానాలు […]

Written By: Neelambaram, Updated On : May 24, 2020 6:08 pm
Follow us on


సోమవారం నుండి దేశంలో విమానాల రాకపోకలకు కేంద్ర పౌరవిమాన శాఖ మంత్రిత్వ శాఖ అంతా సిద్ధం చేస్తున్నా దేశంలోని మూడు పెద్ద రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం తమ రాష్ట్రాలలో విమానాలు తిరగడానికి అభ్యంతరం తెలిపాయి. దానితో విమాన ప్రయాణాలు పాక్షికంగానే జరిగే అవకాశం ఉంటుంది.

కరోనా లాక్‌డౌన్‌ విధించిన రెండు నెలల తర్వాత దేశంలో విమానాల రాకపోకలు జరగబోతున్నాయి. దేశంలో పారిశ్రామికంగా పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర, చెన్నైలు కరోనా వైరస్ ఇంకా కట్టడి కాకపోవడంతో ఇప్పట్లో విమానాలు నడపడానికి విళ్లేదని కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెబుతున్నాయి. కరోనా వైరస్ తో పాటు అంఫాన్ తుఫాన్ కారణంగా భారీ విధ్వంసంకు గురైన పశ్చిమ బెంగాల్ సహితం విమానాలకు అభ్యంతరం తెలిపింది.

ఈ మూడు దేశంలోని అతిపెద్ద రాష్ట్రాలు కావడంతోపాటు, అత్యంత ప్రాముఖ్యత కలిగినవేకాకుండా, అక్కడి విమానాశ్రయాలు దేశంలోనే అత్యంత రద్దీగా ఉండేవే కావడం విశేషం. ఇవి మూడు విమాన ప్రయాణాలకు కూడలిగా కూడా పేరొందాయి.