https://oktelugu.com/

దిల్ రాజు రిక్వెస్ట్ కు పవన్ గ్రీన్ సిగ్నల్..!

పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ కోసం ఆయన అభిమానులు రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. పవన్ కల్యాణ్ నుంచి చివరగా వచ్చిన మూవీ ‘అజ్ఞాతవాసి’. దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈమూవీ ప్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ 50కోట్లపైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీ తర్వాత పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లడంతో సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే ఇటీవలి కాలంలో పవన్ వరుస సినిమాలకు కమిట్ అవుతూ రీ ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ తెలుగు రీమేక్లో […]

Written By: , Updated On : May 24, 2020 / 06:18 PM IST
Follow us on


పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ కోసం ఆయన అభిమానులు రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. పవన్ కల్యాణ్ నుంచి చివరగా వచ్చిన మూవీ ‘అజ్ఞాతవాసి’. దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈమూవీ ప్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ 50కోట్లపైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీ తర్వాత పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లడంతో సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే ఇటీవలి కాలంలో పవన్ వరుస సినిమాలకు కమిట్ అవుతూ రీ ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ తెలుగు రీమేక్లో పవన్ నటిస్తున్నాడు. ‘వకీల్ సాబ్’గా తెరకెక్కుతున్న ఈ మూవీని దిల్ రాజు, శ్రీదేవి భర్త బోనికపూర్ నిర్మిస్తున్నారు.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ ఇప్పటికే 70శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. దేశంలో లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగులు వాయిదా పడటంతో ‘వకీల్ సాబ్’ చిత్రం అర్ధాంతరంగా నిలిచింది. ఇటీవలే టాలీవుడ్ పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి షూటింగులకు పర్నిషన్ ఇవ్వాలని కోరగా సానుకూలంగా స్పందించారు. ఈమేరకు సినిమా పోస్టు ప్రొడక్షన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు షూటింగులను నిర్వహించుకోవాలని సూచించారు. ఈనేపథ్యంలోనే టాలీవుడ్లో మెల్లమెల్లగా షూటింగులు ప్రారంభమవుతోన్నాయి. దీంతో నిర్మాత దిల్ రాజు పవన్ కల్యాణ్ కు ఓ రిక్వెస్ట్ పెట్టుకోగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దిల్ రాజు సినిమా కోసం పవన్ గతంలో కేటాయించిన కాల్షీట్లు పూర్తవడంతో మరోసారి డేట్స్ కేటాయించాలని కోరారట. ఈమేరకు పవన్ జూన్ లో కాల్షీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది.

దీంతో ‘వకీల్ సాబ్’ జూన్ లో పట్టాలెక్కనుందని సమాచారం. ప్రస్తుతానికి షూటింగులన్నీ స్థానికంగా చేసే అవకాశం ఉంది. ‘వకీల్ సాబ్’లో చిత్రం ఇంకో 30శాతం పూర్తి చేసుకుంటే సినిమా పూర్తవుతుంది. ఇందులో కొన్ని కోర్టు సీన్లు తీయాల్సి ఉండటంతో ‘వకీల్ సాబ్’ కేసులను వాదించేందుకు సిద్ధపడుతున్నాడు. ఈ మూవీ పూర్తయ్యాకే క్రిష్ దర్శకత్వంలో పవన్ నటించనున్నాడు. ఈమేరకు జూలైలో పవన్-క్రిష్ కాంబినేషన్లో మూవీ తెరకెక్కనుందని సమాచారం. ఆ తర్వాత పవన్-హరీష్ శంకర్ మూవీ ఉండనుందట.