Jammu and Kashmir Assembly Elections : పోలింగ్ ముగిసిన నేపథ్యంలో పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించాయి. జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉందని పీపుల్స్ సౌత్ సర్వే సంస్థ వెల్లడించింది.. ఆర్టికల్ 370 ఎత్తివేసిన తర్వాత తొలిసారిగా ఈ ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజలు మెజారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నేషనల్ కాన్ఫరెన్స్ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు కల్పిస్తున్నాయి. జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ అసెంబ్లీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం మూడు దశలలో ఎన్నికలు నిర్వహించింది. సున్నితమైన ప్రాంతం కావడంతో కేంద్ర బలగాలు భారీగా భద్రత ఏర్పాటు చేశాయి. పాకిస్తాన్ దేశానికి సరిహద్దు రాష్ట్రం కావడం.. గతంలో ఆర్టికల్ 370 ఎత్తివేయడంతో.. ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించాయి. ఎన్నికల సంఘం ఊహించినట్టు కాకపోయినా.. గతంతో పోల్చితే ఓటింగ్ శాతం పెరిగింది. జమ్ము కాశ్మీర్ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పీపుల్స్ సర్వే సంస్థలు జెకేఎన్ సీ – 33 నుంచి 35 స్థానాలు, బిజెపి 23 నుంచి 27 స్థానాలు, కాంగ్రెస్ 13 నుంచి 15 స్థానాలు, జేకే పిడిపి ఏడు నుంచి 11, ఏఐపి సున్నా నుంచి ఒకటి, ఇతరులు నాలుగు నుంచి ఐదు సీట్లు గెలిచే అవకాశం కల్పిస్తోంది.. రిపబ్లిక్ మాట్రిజ్ సంస్థ బిజెపికి 25, కాంగ్రెస్ పార్టీకి 12, నేషనల్ కాన్ఫరెన్స్ కు 15, పిడిపికి 28 స్థానాలు వస్తాయని వెల్లడించింది. ఇండియా టుడే సి ఓటర్ సర్వేలో నేషనల్ కాన్ఫరెన్స్ కూటమికి 11 నుంచి 15.. భారతీయ జనతా పార్టీకి 27 నుంచి 31.. పీడీపీ సున్నా నుంచి రెండు స్థానాలు, ఇతరులు ఒక స్థానం గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని వెల్లడించాయి. అయితే జమ్ము కాశ్మీర్ తో పాటు హర్యానా రాష్ట్రంలోనూ ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో ఒకే దశలో పోలింగ్ పూర్తయింది. ఈ రాష్ట్రంలో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ ప్రకటించిన వివరాల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 55 స్థానాల్లో లభించే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీకి 26 స్థానాలు దక్కే అవకాశం ఉంది.. ఐఎన్ఎల్డీ రెండు నుంచి మూడు స్థానాలు దక్కుతాయని తెలుస్తోంది. ఇక సట్టా బజార్ అనే సంస్థ సర్వేలో కాంగ్రెస్ పార్టీకి 50, భారతీయ జనతా పార్టీకి 25 సీట్లు వస్తాయని తేలింది. ఏ బి పి సి ఓటర్ సర్వేలో బిజెపికి 78, కాంగ్రెస్ పార్టీకి ఐదు స్థానాలు వస్తాయని వెళ్లడైంది. న్యూస్ 18 ఐపిఎస్ఓఎస్ సర్వేలో బిజెపికి 75, కాంగ్రెస్ పార్టీకి 10 స్థానాలు వస్తాయని తేలింది.