https://oktelugu.com/

Netflix  company :  పంతం వీడని నెట్ ఫ్లిక్స్ సంస్థ.. విక్రమ్ ‘తంగాలాన్’ ఓటీటీ విడుదల కష్టమేనా..? అసలు ఏమి జరిగిందంటే!

ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఇప్పుడు చిక్కుల్లో పడింది. విడుదలకు ముందే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ సంస్థ తో ఫ్యాన్సీ రేట్ కి అగ్రిమెంట్ చేసుకుంది. కానీ సినిమాకి ఆశించిన స్థాయిలో థియేట్రికల్ రన్ రాకపోవడం తో నిర్మాతలతో భేరం పెట్టింది నెట్ ఫ్లిక్స్ సంస్థ.

Written By:
  • Vicky
  • , Updated On : October 5, 2024 / 09:33 PM IST

    Netflix 

    Follow us on

    Netflix  company :  సౌత్ ఇండియా లో విలక్షణ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న హీరోలలో ఒకరు చియాన్ విక్రమ్. కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా, ప్రయోగాత్మక చిత్రాలు తియ్యడం లో ఎప్పుడూ ముందు ఉంటాడు ఈయన. అందువల్ల కొన్ని ఫ్లాప్స్ ఎదురై మార్కెట్ బాగా దెబ్బ తినింది కానీ, ఆయన బ్రాండ్ మాత్రం చెక్కు చెదరలేదు అని చెప్పొచ్చు. పాత్ర కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టే మనస్తత్వం ఉన్న విక్రమ్ రీసెంట్ గా ‘తంగలాన్’ అనే చిత్రం తో మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పీ ఏ రంజిత్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ గా పర్వాలేదు అనే రేంజ్ వసూళ్లను దక్కించుకుంది. కానీ ఆ జానర్ కి అన్ని వర్గాల ప్రేక్షకులు రావడం కష్టమే, అందుకే ఈ చిత్రం కేవలం కొన్ని వర్గాలు మాత్రమే ఆదరించారు. ఫలితంగా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి కేవలం 70 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.

    దీంతో ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఇప్పుడు చిక్కుల్లో పడింది. విడుదలకు ముందే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ సంస్థ తో ఫ్యాన్సీ రేట్ కి అగ్రిమెంట్ చేసుకుంది. కానీ సినిమాకి ఆశించిన స్థాయిలో థియేట్రికల్ రన్ రాకపోవడం తో నిర్మాతలతో భేరం పెట్టింది నెట్ ఫ్లిక్స్ సంస్థ. ముందుగా 40 కోట్ల రూపాయలకు బిజినెస్ డీల్ జరిగింది. అయితే ఒప్పందం కి ముందే సినిమా ఫ్లాప్ అయితే అడిగిన డబ్బులు ఇవ్వలేము అని స్పష్టంగా పాయింట్స్ ఉండడం తో ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ సంస్థ కేవలం 20 కోట్లు మాత్రమే ఇస్తామని నిర్మాతలతో భేరం ఆడారట. కానీ నిర్మాతలు అందుకు ఒప్పుకోలేదు, 35 కోట్లు డిమాండ్ చేసారు. నెట్ ఫ్లిక్స్ సంస్థ ససేమీరా ఒప్పుకోలేదు. చివరిగా పాతిక కోట్ల రూపాయిలు ఇస్తామని నిర్మాతలకు చెప్పారట. కానీ నిర్మాతలు అందుకు ఒప్పుకోకపోవడం తో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నట్టు సమాచారం.

    దీంతో ఇప్పుడు ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో కాకుండా మరో ఓటీటీ లోకి రాబోతుంది. వాస్తవానికి థియేటర్స్ లో హిట్ అయిన ప్రతీ సినిమా ఓటీటీ లో కూడా హిట్ అవుతుందని రూల్ లేదు. అనేక సూపర్ హిట్ సినిమాలు ఓటీటీ లో మిశ్రమ స్పందన దక్కించుకున్నాయి. కానీ కొన్ని ఫ్లాప్ చిత్రాలకు ఓటీటీ లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు ఈ ఏడాది విడుదలైన ‘గుంటూరు కారం’ చిత్రాన్ని తీసుకోవచ్చు. థియేటర్స్ లో డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన ఈ చిత్రానికి నెట్ ఫ్లిక్స్ లో ‘సలార్’ ని మించిన రెస్పాన్స్ వచ్చింది. ఇవన్నీ ప్రత్యక్షం గా చూసిన తర్వాత కూడా ‘తంగలాన్’ చిత్రానికి 35 కోట్లు చెల్లించడానికి నెట్ ఫ్లిక్స్ సంస్థ అంత ఇబ్బంది ఎందుకు పడుతుందో ట్రేడ్ విశ్లేషకులకు కూడా అర్థం కావడం లేదు.