Haryana Assembly Elections : పీపుల్స్ పోల్స్ అనే సంస్థ చేసిన సర్వేలో కాంగ్రెస్ పార్టీకి 50 స్థానాలు లభిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీకి 26 స్థానాలు దక్కుతున్నాయి.. ఐఎన్ఎల్డీ రెండు నుంచి మూడు, జేజేపీ 0-1, స్వతంత్రులు మూడు నుంచి ఐదు స్థానాలు దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. హర్యానా రాష్ట్రంలో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అధికారాన్ని దక్కించుకోవాలంటే 46 స్థానాలను తెలుసుకోవాలి.. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇదే క్రమంలో తన ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీపై ఏడు నుంచి ఎనిమిది శాతం ఓట్లను అధికంగా దక్కించుకున్నదని పీపుల్స్ పల్స్ సంస్థ ప్రకటించింది. ఈ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 45 శాతం, భారతీయ జనతా పార్టీకి 38%, ఎన్ఎల్డీ – బీఎస్పీ కూటమి 5.2 శాతం, ఆప్ 1శాతం, జేజేపీకి ఒక్క శాతం లోపు… ఇతరులకు పది శాతం ఓట్లు లభించే అవకాశం కనిపిస్తోంది.
ముఖ్యమంత్రి ఎవరంటే..
ఇక పీపుల్స్ పల్స్ నిర్వహించిన సర్వేలో ముఖ్యమంత్రి ఎవరు కావాలనే ప్రశ్నకు చాలామంది భూపేందర్ సింగ్ హుడా కు 39 శాతం మంది ఓటర్లు మద్దతు పలికారు.. ప్రస్తుత ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ షైనీకి 28 శాతం మంది అండగా నిలిచారు. కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యురాలు కుమారి షెల్జాకు 10% మంది, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు ఆరు శాతం మంది మద్దతు ప్రకటించారు. హర్యానా రాష్ట్రంలో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ – కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ప్రాంతీయ పార్టీలు ఇండియన్ నేషనల్ లోక్ దళ్ – జననాయక్ జనతా పార్టీలు ఈ ఎన్నికలలో పూర్తిగా బలహీన పడినట్టు తెలుస్తోంది.
స్థానిక అంశాలు తీవ్రంగా ప్రభావితం చేశాయి
ఈ ఎన్నికలలో స్థానిక అంశాలు తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఎమ్మెల్యే పనితీరు, స్థానిక సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల ఆధారంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జాతీయ అంశాలకు ఓటర్లు ఈసారి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభావం ఈ ఎన్నికల్లో కనిపించలేదని పీపుల్స్ పల్స్ సర్వే పేర్కొంది. అగ్ని వీర్ పథకం, నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలు వంటివి హర్యానాలో ప్రధానంగా కనిపించాయి.. పదేళ్లపాటు అధికారంలో ఉన్న పార్టీపై ప్రజల్లో సహజంగానే వ్యతిరేకత ఏర్పడింది. రాష్ట్రంలో రైతులు ఆందోళనలు చేయడం.. రెజ్లర్లు, యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడంతో.. కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ అంచనా వేసింది.