ABN RK : చంద్రబాబు అంటే విపరీతమైన వ్యామోహం.. జగన్ అంటే అసహ్యించుకునే వారిలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ముందు వరుసలో ఉంటారు. ఆయనకు చంద్రబాబు ప్రయోజనాలు, టిడిపి అధికారంలోకి రావడమే లక్ష్యం. అందుకోసం ఆయన జగన్ పై విషపు రాతలు రాస్తూనే ఉంటారు.. వాటిని ప్రజాభిప్రాయంగా చూపుతుంటారు. ఆయన పత్రికలో ప్రతి అక్షరం జగన్ ను వ్యతిరేకించేదిగా ఉంటుంది. ప్రతి శీర్షిక పసుపుదళం అభిమానించేదిగా ఉంటుంది. ఇక వారాంతపు కొత్త పలుకు అయితే జగన్ను విలన్ గా చూపించేందుకే ఉంటుందన్న రీతిలో ఉంటుంది. ఈ క్రమంలో ఆర్కే నిజాలను చెప్పే ప్రయత్నం చేసినా.. అది అబద్దంగా, అభూత కల్పనగా మిగులుతుంది. ” న్యాయం కావాలి” పేరిట ఈ వారాంతపు కామెంట్లో సైతం చంద్రబాబుది అక్రమ అరెస్టు అని.. న్యాయం కావాలని కోరడం విశేషం.
ఈ వారాంతపు కొత్త పలుకులో న్యాయవ్యవస్థ పనితీరుపైనే ఆర్కే ఏకంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక్క చంద్రబాబుకే అన్యాయం ఎందుకు చేస్తున్నారు? జగన్కు ఎందుకు ఇన్ని సంవత్సరాల మినహాయింపు ఇచ్చారు అంటూ నిలదీసినంత పని చేశారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదని.. ఆయన తండ్రిని అనారోగ్యం పరిస్థితుల్లో బెయిల్ ఎందుకు ఇచ్చారని సైతం నిలదీసేలా మాట్లాడారు. చంద్రబాబు విషయంలో కక్ష సాధింపు కనిపిస్తున్న ఎందుకు న్యాయస్థానాలు కళ్ళు మూసుకుంటున్నాయని ఆర్కే ప్రశ్నించడం విశేషం. అయితే గతంలో ఏ నాయకుడి అరెస్టు విషయంలో ఇంతగా స్పందించని ఈ పత్రికాధినేత చంద్రబాబు విషయంలో మాత్రం గింజుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో ఢిల్లీలోని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, చంద్రబాబు కేసులను ఒకే తాటిలో కట్టి ఆర్కే చూపించడం విశేషం. ఇందులో కూడా బిజెపి పెద్దల హస్తం ఉందని అర్థం వచ్చేలా ఆర్కే రాసుకురావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అయితే చంద్రబాబు కేసుల పుణ్యమా అని ఆర్కే చాలా నిజాలను బయటకు వెల్లడించారు. ఏ లాయర్ దగ్గరకు వెళ్తే న్యాయం జరుగుతుందో.. ఆ లాయర్ ఏ జడ్జికి సన్నిహితుడో తెలుసుకొని ఇప్పుడు కచ్చిదారుల అక్కడికి వెళ్తున్నారని.. బెంచ్ పై ఏ జడ్జి ఉంటే ఎలాంటి తీర్పు వస్తుందో ముందే ఊహిస్తున్నారని ఆర్కే ఆవేదన వ్యక్తం చేయడం విశేషం. గతంలో ఇదే ఆర్కే చంద్రబాబు కేసుల విషయంలో వాదనలు వినిపిస్తున్న సిద్ధార్థ లూద్రును ఆకాశానికి ఎత్తివేయడం నిజం కాదా? ఆయన కోరిన మీదటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ కేసు విచారణను త్వరితగతిన చేపట్టాలని ఆదేశించినట్లు ఆంధ్రజ్యోతిలో రాతలు రాయడం నిజం కాదా? బహుశా ఈ కథనం ను అనుసరించే తన కొత్త పలుకులో న్యాయవాది, జడ్జి మధ్య సంబంధాలను ఉదహరించి ఉంటారని సెటైర్లు వినిపిస్తున్నాయి.
కేంద్ర పెద్దల అభయం జగన్కు ఉన్నంతవరకు తామేమి చేయలేమని టిడిపి, ఎల్లో మీడియా భావిస్తుంది. చంద్రబాబు అక్రమ అరెస్టు విషయంలో జగన్కు తెరవెనుక బిజెపి పెద్దలు అంతులేని సాయాన్ని అందిస్తున్నారని చూపేందుకే ఇటువంటి రాతలని తేలుతోంది. ఎలాగైనా బిజెపిలో ఒక రకమైన కదలిక తెచ్చి టిడిపిని దగ్గర చేసుకునేలా ఈ ఎత్తుగడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎలాగైనా జగన్ను బిజెపి నుంచి దూరం చేయడమే ఆర్కే లక్ష్యంగా కనిపిస్తోంది. జగన్ పై బిజెపికి అనుమానం, కోపం కలిగించే కుట్రలో భాగంగా ఆర్కే కలం నుంచి ఇటువంటి మాటలు జాలువారుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో జగన్ ను బలమైన నేతగా చూపించడంలో ఆంధ్రజ్యోతి ఆర్కే సాయం చేస్తున్నారు. పరోక్షంగా ఇది వైసీపీ అధినేతకే లాభిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.