Haridwar: భారత రైల్వే వ్యవస్థకు దశాబ్దాల చరిత్ర ఉంది. బ్రిటిష్ కాలంలో అంటే 1853లో భారత్‌లో రైల్వే లైన్ నిర్మాణం జరిగింది. స్వాతంత్య్రం వచ్చేనాటికి దేశంలో 42 రైల్వే సంస్థలు నెలకొల్పబడ్డాయి. 1951లో ఈ సంస్థలన్నీ కలిపి భారత రైల్వేగా ఏర్పడింది. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థలో ఒకటిగా ఆవిర్భవించింది. దేశంలో రైలు మార్గాలు నలుమూలలా విస్తరించి ఉన్నాయి. 2002 నాటికి దేశంలో రైల్వే వద్ద 2,16,717 వ్యాగన్లు, 39,263 కోచ్‌లు, 7,739 ఇంజిన్లు ఉన్నాయి. భారత రైల్వే న్యితం 14,444 రైళ్లు నడుపుతుంది. ఇందులో 8,702 ప్యాసింజర్ రైళ్లు. ఇక బ్రిటిష్ కాలంలో వేసిన రైల్వే ట్రాక్‌లను భారత రైల్వే సంస్థ ప్రస్తుతం ఆధునికీకరించి వినియోగిస్తోంది. అంతేకాకుండా కొత్త రైలు మార్గాలను నిర్మిస్తోంది. విస్వరిస్తోంది. కొత్త నగరాలు, గ్రామాలు, పట్టణాలను కలుపుతోంది. పేదల నుంచి సంసన్నుల వరకు అత్యంత సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థ రైల్వేనే.
కెనాల్‌లో బ్రిటిష్ కాలం ట్రాక్..
ఇదిలా ఉంటే.. తాజాగా హరిద్వార్‌లో బ్రటిష్ కాలం నాటి రైల్వే ట్రాక్ బయట పడింది. నదిలో నీరు తగ్గుముఖం పట్టడంలో వార్షిక నిర్వహణ పనుల కోసం గంగా కెనాల్‌ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఈ నేపథ్యంలో రైల్వే ట్రాక్ బయటపడింది. దానిని చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. గంగా కెనాల్ నిర్మాణ సమయంలో వస్తు రవాణా కోసం బ్రిటిష్‌వారే ఈ ట్రాక్‌ను నిర్మించి ఉంటారని భావిస్తున్నారు. బ్రిటిష్ కాలంలో ఈ ట్రాక్‌పై ఇంగ్లిష్ అధికారులు ట్రాలీ సాయంతో ఈ ట్రాక్‌పై ప్రయాణించేవారని స్థానికులు తెలిపారు.
ఏటా కెనాల్ మూసివేత..
ఇదిలా ఉంటే.. గంగా కెనాల్‌ను నిర్వహణ కోసం ఏటా నిర్వహిస్తారు. ఇందుకోసం నీటిమట్టం తగ్గగానే 15 రోజులు మూసివేస్తారు. తర్వాత నిర్వహణ పనులు చేపడతారు. తాజాగా ఈ పనుల కోసం కెనాల్‌ను మూసివేయగా బ్రిటిష్ కాలంనాటి రైల్వే ట్రాక్ వెలుగు చూసింది. ఇంకా అనేక మార్గల్లో రైల్వే ట్రాక్‌లు ఉండి ఉంటాయని. అవి నదులు ఉప్పొంగడం ద్వారా, ప్రకృతి వైపరీత్యాల కారణంగా కనుమరుగై ఉండి ఉంటాయని భావిస్తున్నారు. వివిధ సందర్భాల్లో ఇలా బయట పడుతున్నాయని పేర్కొంటున్నారు.