Gangavva: గంగవ్వ బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 కంటెస్టెంట్. రెండు వారాల క్రితం ఆమె వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది. గంగవ్వతో పాటు మాజీ కంటెస్టెంట్స్ రోహిణి, అవినాష్, మెహబూబ్, గౌతమ్, నయని పావని, టేస్టీ తేజ, హరితేజ వైల్డ్ కార్డ్ ద్వారా సీజన్ 8లో కంటెస్ట్ చేస్తున్నారు. గంగవ్వ వయసులో పెద్దవారు. అందులోను ఆమె పల్లెటూరి వాతావరణంలో పుట్టి పెరిగింది. సీజన్ 4లో ఆమె ఎలిమినేట్ కాలేదు. అనారోగ్య కారణాలతో సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యింది.
బిగ్ బాస్ మేకర్స్ ఆమెకు మరోసారి అవకాశం ఇచ్చారు. కాగా షోలో గంగవ్వకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఆమె ఫిజికల్ టాస్క్ లలో పాల్గొనడం లేదు. కాగా గత రాత్రి ఆమెకు గుండెపోటు వచ్చిందట. అర్థరాత్రి గుండెపోటు రావడంతో తోటి కంటెస్టెంట్స్ హడలెత్తిపోయారట. ముఖ్యంగా విష్ణుప్రియకు చెమటలు పట్టాయట. తన వల్లే ఆమెకు గుండెపోటు వచ్చిందని విష్ణుప్రియ భయపడిందట.
హుటాహుటిన డాక్టర్స్ టీమ్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారట. ఆమెకు వైద్యం అందిస్తున్నారట. ఈ మేరకు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. అయితే ఇది ఫ్రాంక్ అనే మరో వాదన వినిపిస్తోంది. బిగ్ బాస్ ఆదేశాల మేరకు గంగవ్వ హార్ట్ అటాక్ వచ్చినట్లు నటించిందట. తోటి కంటెస్టెంట్స్ ని ఆమె నమ్మించాలి అనేది టాస్క్ అట. ఈ టాస్క్ లో గంగవ్వ సక్సెస్ అయ్యిందని అంటున్నారు.
అయితే ఇలాంటి టాస్క్ లు చాలా ప్రమాదకరం. తోటి కంటెస్టెంట్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో గంగవ్వ కుటుంబ సభ్యులు ప్రభావితం అవుతారు. కాబట్టి ఈ తరహా టాస్క్స్ కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ ఇవ్వకుండా ఉంటేనే మంచిది అంటున్నారు.