కేసీఆర్.. పీఆర్సీ.. ఓ 60వేల కోట్ల మిగులు కథ!

‘కళ్లు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు.. కానీ దిమాక్ ఉన్నోడో దునియా మొత్తం చూస్తాడని’ ఒక పాపులర్ డైలాగ్ ఉంది. అదిప్పుడు సీఎం కేసీఆర్ కు అక్షరాల సూట్ అవుతుందని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్ కొన్నేళ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరాడుతున్న పీఆర్సీ , పదవీ విరమణ పెంపును ఒక్కసారిగా ప్రకటించేసరికి ఆయన మీద క్షీరాభిషేకాలు వెల్లువెత్తాయి.. ‘కేసీఆర్ నువ్వు దేవుడువు సామీ’ అంటూ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆయన చిత్రపటాలను పాలతో […]

Written By: NARESH, Updated On : March 27, 2021 11:40 am
Follow us on

‘కళ్లు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు.. కానీ దిమాక్ ఉన్నోడో దునియా మొత్తం చూస్తాడని’ ఒక పాపులర్ డైలాగ్ ఉంది. అదిప్పుడు సీఎం కేసీఆర్ కు అక్షరాల సూట్ అవుతుందని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

సీఎం కేసీఆర్ కొన్నేళ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరాడుతున్న పీఆర్సీ , పదవీ విరమణ పెంపును ఒక్కసారిగా ప్రకటించేసరికి ఆయన మీద క్షీరాభిషేకాలు వెల్లువెత్తాయి.. ‘కేసీఆర్ నువ్వు దేవుడువు సామీ’ అంటూ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆయన చిత్రపటాలను పాలతో కుమ్మరించి వేయినోళ్ల పొగుడుతున్నారు. కానీ ఉద్యోగుల చెవుల్లో కేసీఆర్ పూలు పెట్టాడని పీఆర్సీ, రిటైర్ మెంట్ పెంపుతో కేసీఆర్ కు దాదాపు 60వేల కోట్లు ఈ మూడేళ్లలో మిగలబోతున్నాయని సీనియర్ ఉద్యోగ, ఉపాధ్యాయులు లెక్కలు వేస్తున్నారట..

వచ్చే మూడేళ్లలో కనీసం 20వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ కాబోతున్నారంటూ అంచనా.. చిన్న కేడర్ కు రిటైర్ మెంబ్ బెనిఫిట్స్ కింద 20 లక్షల వరకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఇక గ్రూప్ 1 అత్యున్న పోస్టుకు కనీసం 40 లక్షలు బెనిఫిట్స్ ఇవ్వాలి. వీరిద్దరి సగటు 30 లక్షలు అనుకున్నా.. మూడేళ్లలో ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన రిటైర్ మెంట్ బెనిఫిట్స్  ఎంతలేదన్నా 60వేల కోట్లు చెల్లించాలి. అంటే కరోనా కల్లోలంలో ఆదాయం లేని సమయంలో ప్రభుత్వం ఇన్ని కోట్లు చెల్లించాలంటే తలకు మించిన భారమే. వీటికోసం ఖచ్చితంగా అప్పులు తేవాలి. ఈ మూడేళ్లలో వాటికి వడ్డీలు కట్టాలి.

అదే ఉద్యోగ విరమణ వయసు 61 ఏళ్లకు వ్యూహాత్మకంగా పెంచాడు కేసీఆర్. అంటే మూడేళ్ల వరకు ఏ ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ కాడు. వారికి కేవలం నెలనెల ఇచ్చే జీతాలు ఇస్తే చాలు. ఇప్పుడు ఎలాగూ ప్రభుత్వ ఉద్యోగులకు ఠంచనుగా జీతాలు ఇస్తున్నాడు. అలాగే ఇస్తూ పోతాడు. కాబట్టి ప్రభుత్వంపై పెద్దగా భారం పడదు. అంటే దాదాపు 60వేల కోట్లు కేసీఆర్ కు మిగులుతున్నట్టే లెక్క.

కేసీఆర్ పాలన ఇంకో మూడేళ్లు ఉంది. అప్పటికే కేసీఆర్ వస్తే ఆ 60వేల కోట్ల భారం మళ్లీ టీఆర్ఎస్ సర్కార్ పైనే పడుతుంది. ఒకవేళ ఓడిపోయి వేరే ప్రభుత్వం వస్తే ఈ తలకుమించిన భారం వారిపై పడుతుంది.

ఇలా స్కెచ్ గీసిన కేసీఆర్ ఉద్యోగులకు రిటైర్ మెంట్ బెనిఫిట్స్ కింద 60వేల కోట్లు ఇచ్చేబదులు మూడేళ్ల దాకా జీతాలు ఇచ్చింది బెటర్ అని పీఆర్సీ పెంచి వారిని కూల్ చేశాడని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 61 ఏళ్లకు పెంపుతో ఇప్పుడు ఏ ఉద్యోగి మూడేళ్ల దాకా రిటైర్ కాడు. ప్రభుత్వం నుంచి పైసా వారికి రిటైర్ మెంట్ బెనిఫిట్స్ పోవు. ఆ మొత్తం మిగిలినట్టే. ఇక రిటైర్ మెంట్లు ఆగితే కొన్ని శాఖల ఉద్యోగులకు పని ఉండదు. వారిని ప్రత్యామ్మాయంగా వాడుకోవచ్చు.

ఇలా ఒకే దెబ్బకు కేసీఆర్ చాలా పిట్టలను కొట్టేశాడు. అటు ప్రభుత్వానికి మూడేళ్ల దాకా ఖర్చు లేకుండా.. పైసా విదిల్చకుండా.. ఇటు ఉద్యోగుల కోరికలు తీర్చి తన జీనియస్ మెదడుకు పనిచెప్పి కాగల కార్యాన్ని చాలా చక్కగా నిర్వర్తించాడని చెబుతున్నారు. ఎంతైనా కేసీఆర్ ది బుర్రే బుర్ర. ఆయనను మించిన అపరచాణక్యుడు లేడని అంటున్నారు.

-ఎన్నం