https://oktelugu.com/

క్రెడిట్ కార్డ్ వాడేవాళ్లకు శుభవార్త.. ఇలా చేస్తే లాభం..?

దేశంలోని కోట్ల సంఖ్యలో ఉద్యోగులు, వ్యాపారులు క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. అయితే క్రెడిట్ కార్డును వినియోగించడం వల్ల రివార్డు పాయింట్లను పొందవచ్చు. చాలామంది క్రెడిట్ కార్డులను వినియోగించే వాళ్ళు ఈ రివార్డ్ పాయింట్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆ రివార్డు పాయింట్ల సహాయంతో కొంతమంది ఆన్ లైన్ లో వస్తులను కొనుగోలు చేస్తారు. మనం క్రెడిట్ కార్డును వినియోగించి చేసే లావాదేవీలను బట్టి రివార్డ్ పాయింట్లు వస్తాయి. Also Read: 170 రూపాయలకే గ్యాస్ సిలిండర్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 26, 2021 / 09:12 PM IST
    Follow us on

    దేశంలోని కోట్ల సంఖ్యలో ఉద్యోగులు, వ్యాపారులు క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. అయితే క్రెడిట్ కార్డును వినియోగించడం వల్ల రివార్డు పాయింట్లను పొందవచ్చు. చాలామంది క్రెడిట్ కార్డులను వినియోగించే వాళ్ళు ఈ రివార్డ్ పాయింట్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆ రివార్డు పాయింట్ల సహాయంతో కొంతమంది ఆన్ లైన్ లో వస్తులను కొనుగోలు చేస్తారు. మనం క్రెడిట్ కార్డును వినియోగించి చేసే లావాదేవీలను బట్టి రివార్డ్ పాయింట్లు వస్తాయి.

    Also Read: 170 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పొందే ఛాన్స్.. ఎలా అంటే..?

    క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఈ రివార్డు పాయింట్ల యొక్క వినియోగం, అదనపు ప్రయోజనాలకు సంబంధించి కచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. క్రెడిట్ కార్డులను బట్టి, బ్యాంకులను బట్టి రివార్డు పాయింట్లను తీసుకుంటే మంచిది. కొన్ని బ్యాంకులు 100 రూపాయలు ఖర్చు చేస్తే ఒక రివార్డు ఆయింట్ ను ఇస్తుండగా మరికొన్ని బ్యాంకులు ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తే మాత్రమే రివార్డు పాయింట్లను ఇస్తున్నాయి.

    Also Read: హోమ్ లోన్ తీసుకునే వారికి శుభవార్త.. 6 ఈఎంఐలు మాఫీ..?

    ఉపయోగించే కార్డు రకం, ఖర్చులను బట్టి కూడా రివార్డు పాయింట్లు ఆధారపడి ఉంటాయి. కొన్ని బ్యాంకులు మాత్రం బోనస్ రివార్డు పాయింట్లను ఇస్తున్నాయి. నిర్ణీత వ్యవధిలో నిర్ధేశిత మొత్తాన్ని ఖర్చు చేసిన వాళ్లు ఈ బోనస్ రివార్డు పాయింట్లను పొందవచ్చు. కార్డు తీసుకునే సమయంలో ఈ రివార్డు పాయింట్ల గురించి తెలుసుకోవాలి. కొన్ని బ్యాంకులు రివార్డ్ పాయింట్లకు బదులుగా క్యాష్ బ్యాక్ ఇస్తుండటం గమనార్హం.

    క్రెడిట్ కార్డ్ లావాదేవీల ద్వారా వచ్చే పాయింట్లకు కాలపరిమితి ఉంటుంది. వినియోగదారుడు కాలపరిమితికి సంబంధించి తప్పనిసరిగా అవగాహనను కలిగి ఉండాలి. . పాయింట్లకు ఎక్కడ అధిక విలువ లభిస్తుందో వాటిని అక్కడే వినియోగించుకుంటే మంచిది. పండగ సీజన్‌లో, ప్రత్యేక ఆఫర్ సీజన్ లో రివార్డ్ పాయింట్లను వినియోగిస్తే రివార్డ్ పాయింట్లపై బోనస్ పాయింట్లను కూడా పొందే అవకాశం ఉంటుంది.