https://oktelugu.com/

ఆచార్య ఫస్ట్ లుక్: చిరంజీవితో కలిసి తుపాకీ పట్టిన రాంచరణ్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. దిగ్గజ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీలో ‘రాంచరణ్’ ఫస్ట్ లుక్ ను చిత్రం యూనిట్ రిలీజ్ చేసింది. రాంచరణ్ ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. ‘నాన్న చిరంజీవితో నటించాలన్న నా కల నెరవేరింది. ‘మీ పక్కన నటించడం కేవలం ఒక కల.. అది నెరవేరడం కంటే ఎక్కువ నాన్నా!’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 27, 2021 / 09:37 AM IST
    Follow us on

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. దిగ్గజ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీలో ‘రాంచరణ్’ ఫస్ట్ లుక్ ను చిత్రం యూనిట్ రిలీజ్ చేసింది.

    రాంచరణ్ ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. ‘నాన్న చిరంజీవితో నటించాలన్న నా కల నెరవేరింది. ‘మీ పక్కన నటించడం కేవలం ఒక కల.. అది నెరవేరడం కంటే ఎక్కువ నాన్నా!’ అంటూ ట్వీట్ చేశాడు.

    ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. చెర్రీ రోల్ మొదట 30 నిమిషాలు ఉంటుందనే ప్రచారం జరిగినప్పటికీ.. ఆ త‌ర్వాత సిద్ధ పాత్ర‌ను గంట వ‌ర‌కు పొడిగించిన‌ట్టు స‌మాచారం. ఈ మేర‌కు రాజ‌మౌళితో చిరు ప్ర‌త్యేకంగా మాట్లాడి, డేట్స్ అడ్జెస్ట్ చేయించార‌నే వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టాయి. అయితే.. తాజాగా ఆచార్య‌కు సంబంధించి కీ పాయింట్స్ లీక‌య్యాయి. ఇప్పుడు ఈ టాపిక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

    ఈ సినిమాలో చిరుతోపాటు రామ్ చ‌ర‌ణ్ న‌క్స‌లైట్లుగా క‌నిపించ‌బోతున్నార‌న్న విష‌యం తెలిసిందే. దేవాదాయ భూముల ఆక్ర‌మ‌ణ‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్గో దావ‌రి జిల్లాలోని మారేడు మిల్లి అడ‌వుల్లో పూర్తయ్యింది. ఇక్క‌డ కొన్ని యాక్ష‌న్ సీన్స్ తెర‌కెక్కించారు.

    మే 14 న రిలీజ్ కానున్న ఈ భారీ బ‌డ్జెట్  ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాన్ని.. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, మ్యాట్నీ ఎంట‌ర్ టైన్ మెంట్ బ్యాన‌ర్ల‌పై రామ్ చ‌ర‌ణ్‌, నిరంజ‌న్ రెడ్డి నిర్మిస్తున్నారు.