https://oktelugu.com/

Upcoming Elections: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు: పోల్ సర్వేలో ఎవరిది విజయం?

Upcoming Elections: దేశంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. త్వరలో జరిగే అయిదు స్టేట్ల ఎన్నికలతో ఆరంభం కానుంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా స్టేట్లలో ఫిబ్రవరి నుంచి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నగారా మోగించింది. దీంతో రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని పావులు కదుపుతున్నాయి. 2024లో జరిగే ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న ఇందులో ఎలాగైనా నెగ్గాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. దీంతో పలు సర్వే సంస్థలు ముందే సర్వే నిర్వహించాయి. […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 18, 2022 / 11:53 AM IST
    Follow us on

    Upcoming Elections: దేశంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. త్వరలో జరిగే అయిదు స్టేట్ల ఎన్నికలతో ఆరంభం కానుంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా స్టేట్లలో ఫిబ్రవరి నుంచి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నగారా మోగించింది. దీంతో రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని పావులు కదుపుతున్నాయి. 2024లో జరిగే ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న ఇందులో ఎలాగైనా నెగ్గాలని ప్రణాళికలు రచిస్తున్నాయి.

    Upcoming Elections:

    దీంతో పలు సర్వే సంస్థలు ముందే సర్వే నిర్వహించాయి. ఇందులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజకీయ పార్టీల్లో ఆందోళన పెరుగుతోంది. సమయం సమీపిస్తున్న తరుణంలో పార్టీల్లో కలవరం ఎక్కువైంది. దేశంలోనే పెద్ద రాష్ర్టమైన ఉత్తర ప్రదేశ్ లో పాగా వేయడానికి పార్టీలు పట్టుపడుతున్నాయి. అధికారం కోసం ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు.

    Also Read: ఎన్టీఆర్ ఆత్మ 16 ఏళ్ల అమ్మాయిలో ప్రవేశించిందట !

    ఉత్తరప్రదేశ్ లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలుస్తోంది. ఇక్కడ 252-272 సీట్లలో బీజేపీ విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నాయి. రెండో స్థానంలో సమాజ్ వాదీ పార్టీ నిలుస్తుందని చెబుతున్నాయి. ఎస్పీకి 131 సీట్ల వరకు వస్తాయని వెల్లడిస్తోంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం అధ్వానంగా మారనుంది. బీఎస్పీ కూడా అదే దారిలో నడవనుంది. దీంతో యూపీలో ఆసక్తికరంగా ఫలితాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది.

    పంజాబ్ లో ఆప్ అధికారంలోకి రానుంది. 117 స్థానాలున్న పంజాబ్ లో అమ్ ఆద్మీ పార్టీ 56 సీట్లు సాధించవచ్చని సూచిస్తోంది. తరువాత స్థానంలో కాంగ్రెస్ పార్టీ నిలవనుంది. శిరోమణి అకాలీదళ్, బీజేపీలకు తగిన స్థానాలు దక్కకపోవచ్చని తెలుస్తోంది. ఉత్తరాఖండ్ లో కూడా బీజేపీ అధికారంలోకి రావచ్చని సర్వే తెలిపింది. దీంతో రాజకీయ పార్టీల్లో ప్రచారం మొదలు కానుంది.

    మణిపూర్ లో కూడా మరోసారి బీజేపీ అధికారం చేపడుతుందని చెబుతున్నారు. 60 సీట్లున్న అసెంబ్లీలో 42 స్థానాలు గెలుచుకోవచ్చని తెలుస్తోంది. ఇక్కడ రెండో స్థానం కాంగ్రెస్ దక్కించుకోనుంది. నాగా పీపుల్స్ పార్టీ, ఇతర పార్టీలు రెండు స్థానాల్లో విజయం సాధించవచ్చని సమాచారం. గోవాలో కూడా బీజేపీ మరోమారు అధికారం చేపట్టనుందని తెలుస్తోంది. 40 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీ 20 స్థానాల్లో విజయం సాధించనుందని చెబుతున్నారు.

    Also Read: వర్ధంతి: ప్రత్యర్థులకు ఘనంగా ‘ఎన్టీఆర్ కు వెన్నుపోటు దినోత్సవం’

    Tags