Homeఆంధ్రప్రదేశ్‌Laxmiparvathi: ‘ఎన్టీఆర్ ఆత్మ కనపడిందట.. మాట్లాడిందట..’ లక్ష్మీపార్వతీ ఏంటమ్మా ఇదీ!

Laxmiparvathi: ‘ఎన్టీఆర్ ఆత్మ కనపడిందట.. మాట్లాడిందట..’ లక్ష్మీపార్వతీ ఏంటమ్మా ఇదీ!

Laxmiparvathi: ‘‘‘ఎన్టీఆర్ ఆత్మ కనపడిందట.. తనతో మాట్లాడిందట..’ ఎన్టీఆర్ చనిపోయాక లక్ష్మీపార్వతిని సినీ జంట జీవిత, రాజశేఖర్ చెన్నై తీసుకెళ్లి ఒక యువతిలో ఆవహించిన ఎన్టీఆర్ ఆత్మతో మాట్లాడించారట..’’’ ఇప్పుడు లక్ష్మీపార్వతి పలికిన ఈ డైలాగులు వైరల్ అయ్యాయి. ఎంత ఎన్టీఆర్ తో కాపురం చేసి.. అంత ప్రేమ ఉన్నా సరే.. లక్ష్మీపార్వతి చెప్పిన మాటలు మాత్రం నమ్మశక్యంగా లేవు.. ఇప్పుడు దీనిపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి..

laxmipravathi

ఎన్టీఆర్ మళ్లీ పుడుతాడని అంటే ఓకే.. ఆయన తెలుగు వారి గుండెల్లో ఉన్నారంటే ఓకే.. కానీ ఆయన ఆత్మ ఇంకా తిరుగుతోందని.. తనతో మాట్లాడుతుందని.. ఇది వరకూ మాట్లాడనని.. ఈ రహస్యం ఎప్పుడూ బయటపెట్టలేదని లక్ష్మీపార్వతి అన్న మాటలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.

రాకెట్ వేసుకొని అంతరిక్షంలోకి వెళుతున్న ఈ కాలంలో కూడా ఇంకా లక్ష్మీపార్వతి ఆత్మలతో మాట్లాడుతోందని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. ప్రేమ ఉండాలే కానీ.. ఇంతటి ఆత్మల ప్రేమ అవసరమా? అమ్మా అంటూ సెటైర్లు వేస్తున్నారు.

నేడు ఎన్టీఆర్ వర్ధంతి.. ఇప్పటికే బాలయ్య సహా నందమూరి కుటుంబ సభ్యులు ఆయన సమాధిని దర్శించుకొని నివాళులర్పించారు.కొంచెం లేట్ గా వచ్చిన ఆయన భార్య లక్ష్మీపార్వతి ఇప్పుడు ‘ఎన్టీఆర్ మరణించిన తర్వాత ఆయన ఆత్మతో మాట్లాడానని’ చెప్పిన మాటలు విని ముందుట ఉన్న విలేకరులు తెలుగు జనాలు అవాక్కయ్యారు. లక్ష్మీపార్వతి చెప్పేది నమ్మలా? నమ్మకూడదా? అసలు కండీషన్ బాగానే ఉందా? అని ఆరాతీశారు.

ఎన్టీఆర్ ఇన్ని రోజులు ఆత్మగా మన చుట్టూ తిరుగుతున్నాడట.. అలా అయితే చంద్రబాబే కాస్తా జాగ్రత్తగా ఉండాలి.. ఆయన అంత ధీమాగా ఉన్నారంటే ఎన్టీఆర్ ఆత్మ తనను పదవీచిత్యుడిని చేసిన చంద్రబాబు ఏం చేయడం లేదన్న మాట.. లక్ష్మీపార్వతిని చూసి ఇప్పుడు అందరూ ‘ఫాఫం’ అంటున్నారు..  ఇప్పుడు ‘ఎన్టీఆర్ ఆత్మ ముచ్చట’ తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతోంది.

https://www.youtube.com/watch?v=6IxbcCe7dPU

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

2 COMMENTS

  1. […] Heart Attack: ఒంటరిగా వున్నప్పుడు గుండెనొప్పి వస్తే.. ? ఇక ఆ మనిషి బతకడం సాధ్యం కాదు అంటూ ఓ నమ్మకం ప్రజలలో బలంగా నాటుకుపోయింది. ఐతే, గుండెనొప్పి వచ్చినప్పుడు ఒకవేళ మనం ఒంటరిగా ఉన్నా మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఓ వ్యక్తి తన జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి చెబుతూ ఇలా మాట్లాడాడు. […]

Comments are closed.

Exit mobile version