https://oktelugu.com/

Chiranjeevi: సొంతల్లుడికి కనీసం మాటసాయం చేయని చిరు… కారణం?

Chiranjeevi: మెగా హీరో సినిమా అంటే ఆ సందడే వేరు. చిరంజీవి నుండి అల్లు శిరీష్ వరకు స్టార్ డమ్ తో సంబంధం లేకుండా ఆ ఫ్యామిలీ హీరో సినిమా అంటే ఓ హైప్ ఉంటుంది. చిరంజీవి వారసులుగా ఎంట్రీ ఇచ్చిన చాలా మంది హీరోలు సక్సెస్ అయ్యారు. ఇక చిరంజీవి అండతో పరిశ్రమకు హీరోగా పరిచయమైన వారిలో కళ్యాణ్ దేవ్ ఒకరు. చిరు చిన్న కుమార్తె శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్. నటనపై మక్కువతో హీరోగా […]

Written By:
  • Shiva
  • , Updated On : January 18, 2022 12:32 pm
    Follow us on

    Chiranjeevi: మెగా హీరో సినిమా అంటే ఆ సందడే వేరు. చిరంజీవి నుండి అల్లు శిరీష్ వరకు స్టార్ డమ్ తో సంబంధం లేకుండా ఆ ఫ్యామిలీ హీరో సినిమా అంటే ఓ హైప్ ఉంటుంది. చిరంజీవి వారసులుగా ఎంట్రీ ఇచ్చిన చాలా మంది హీరోలు సక్సెస్ అయ్యారు. ఇక చిరంజీవి అండతో పరిశ్రమకు హీరోగా పరిచయమైన వారిలో కళ్యాణ్ దేవ్ ఒకరు. చిరు చిన్న కుమార్తె శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్. నటనపై మక్కువతో హీరోగా మారారు. మొదటి చిత్రంగా విజేత చేశారు. చిరంజీవి ఐకానిక్ చిత్రాలలో విజేత ఒకటి. మామయ్య టైటిల్ తో వచ్చిన విజేత గొప్ప విజయమైతే అందుకోలేదు.

    Chiranjeevi

    Chiranjeevi

    అల్లుడు మొదటి సినిమా కావడంతో చిరంజీవి బాగానే ప్రమోట్ చేశారు. అయితే కళ్యాణ్ దేవ్ రెండవ చిత్రం సూపర్ మెచ్చి సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల అవుతుంది. ఈ సినిమా గురించి ప్రేక్షకులకు కనీస అవగాహన లేదు. ప్రమోషన్స్ విషయంలో సూపర్ మచ్చి పూర్తిగా విఫలమైంది. చిరంజీవి సొంత అల్లుడు చిత్రం ఇంత అనామకంగా విడుదల కావడం ఆశ్చర్య పరిచే విషయం. ప్రమోషనల్ ఈవెంట్స్ పక్కన పెడితే.. సోషల్ మీడియా ప్రమోషన్స్ కూడా లేవు.

    Also Read:  వర్ధంతి: ప్రత్యర్థులకు ఘనంగా ‘ఎన్టీఆర్ కు వెన్నుపోటు దినోత్సవం’

    మెగా హీరోలైన చిరంజీవి, పపన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్స్ ఎవరూ సూపర్ మచ్చి సినిమాకు మద్దతు ఇవ్వలేదు. కనీసం మాట సహాయం చేయలేదు. సూపర్ మచ్చి చిత్రం జనవరి 14న విడులవుతుందన్న విషయం ప్రేక్షకులకు తెలియదు. మెగా ఫ్యామిలీ లో హీరోలకున్ స్టార్ రీత్యా వారి చేసే ఒక్క ట్వీట్, కామెంట్ సినిమాకు చాలా ప్లస్ అవుతుంది. ఎంతో కొంత వసూళ్లకు కారణం అవుతుంది. అంత పెద్ద సపోర్ట్ ఉంచుకొని కళ్యాణ్ దేవ్ ఎందుకు వాడుకోవడం లేదో అర్థం కావడం లేదు.

    కళ్యాణ్ దేవ్ మెగా హీరోలు తన సినిమాను ప్రమోట్ చేయాలని కోరుకోలేదా? లేక వారు కావాలనే ఆయన సినిమాను ప్రమోట్ చేయలేదా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఆ మధ్య మెగా హీరోలందరూ పాల్గొన్న ఓ కార్యక్రమంలో కళ్యాణ్ దేవ్ కనిపించలేదు. అలాగే కళ్యాణ్ దేవ్ కి మెగా ఫ్యామిలీ కి మధ్య దూరం పెరిగిందని, మనస్పర్థలు చోటుచేసుకున్నాయన్న కథనాలు వెలువడ్డాయి. పరిస్థితులు చూస్తుంటే ఈ వార్తల్లో నిజం ఉందేమో అనిపిస్తుంది.

    ఇక సూపర్ మచ్చి చిత్రానికి పులివాసు దర్శకత్వం వహించారు. కన్నడ భామ రచిత రామ్ హీరోయిన్ గా నటించగా యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.

    Also Read: ఇంట్లో వ‌స్తువులు చెద‌లు ప‌ట్టాయా.. జీవితంలో ఈ ఇబ్బందులు త‌ప్ప‌వు..!

    Tags