Tamil Nadu: డాగ్‌ లవర్స్‌ బీ అలర్ట్‌.. 23 జాతుల కుక్కలపై నిషేధం!

దేశంలో పెరుగుతున్న కుక్కకాటు కేసుల నేపథ్యంలో పిట్‌ బుల్‌ టెర్రియర్, అమెరికన్‌ బుల్‌డాగ్, రోటవీలర్‌ లాంటి పలు కుక్క జాతుల పెంపకాన్ని నిషేధించాలని కేంద్రం ఈ ఏడాది మార్చిలో రాష్ట్రాలను ఆదేశించింది.

Written By: Raj Shekar, Updated On : May 10, 2024 3:27 pm

Tamil Nadu

Follow us on

Tamil Nadu: దేశంలో వీధికుక్కల దాడులు పెరుగుతున్నాయి. కుక్కకాటుతో చనిపోతున్నవారి సంఖ్య కూడా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. టా మిలియన్ల కొద్దీ దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు, సీనియర్‌ సిటిజన్ల మరణాలు సంభవిస్తున్నాయి. దేశంలో 3.5 కోట్లకుపైగా వీధికుక్కలు ఉన్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో వాటి నుంచి రక్షించుకోవడం ప్రజలకు సవాల్‌గా మారింది. ఇక పెంపుడు కుక్కలు కూడా ఇటీవల యజమానులతోపాటు కుటుంబ సభ్యులపై దాడిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

23 జాతుల శునకాలపై నిషేధం..
దేశంలో పెరుగుతున్న కుక్కకాటు కేసుల నేపథ్యంలో పిట్‌ బుల్‌ టెర్రియర్, అమెరికన్‌ బుల్‌డాగ్, రోటవీలర్‌ లాంటి పలు కుక్క జాతుల పెంపకాన్ని నిషేధించాలని కేంద్రం ఈ ఏడాది మార్చిలో రాష్ట్రాలను ఆదేశించింది. అయితే తమిళనాడు ప్రభుత్వం పిట్‌బుల్‌ టెర్రియర్, తోసా ఇను సహా 23 జాతుల క్రూరమైన కుక్క జాతులను నిషేధించింది. ఈమేరకు ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ గురువారం(మే 9న) ప్రకటించింది. ఇటీవల చెన్నైలో రోట్‌ వీలర్‌ డాగ్‌ బాలుడిని గాయపర్చిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

పెంపకం నిలిపివేయాలి..
క్రూరమైనవిగా భావించే 23 జాతుల దిగుమతి, పెంపకం, అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. వీటి పెంపకం, విక్రయాలు నిలిపి వేయాలని రాష్ట్రాలను కోరింది. అదే సమయంలో వాటì కి గర్భనిరోధక చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాతిల ప్రాంతాలను కోరింది. ఈమేరకు తమిళనాడు ప్రభుత్వం లేఖలు రాసింది. కొన్ని జాతుల కుక్కలను పెంపుడు జంతువులుగా, ఇతర 6పయోజనాల కోసం ఉపయోగించకుండా నిషేధించాలని పౌరులు, సిటిజన్‌ ఫోరమ్‌లు, యానిమల్‌ వెల్ఫేర్‌ ఆర్గనైనేషన్‌ ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

కేంద్రం నిషేధించిన కుక్కలు ఇవే..
పిట్‌బుల్‌ టెర్రియర్, టోసా ఇను, అమెరికన్‌ స్టోఫోర్డ్‌షైర్‌ టెర్రియర్, ఫిలా బ్రసిలిరో, డోగో అర్జెంటీనో, అమెరికన్‌ బుల్‌ డాగ్, బోర్‌బోయెల్‌ కంగల్, సెంట్రల్‌ ఏషియన్‌ షెఫర్డ్‌ డాగ్, కాకేసియన్‌ షెఫర్డ్‌ డాగ్, ఇంకా సౌత్‌ రష్యన్‌ షెఫర్డ్‌ డాగ్, టోర్న్‌జాక్, సర్లా్పనినాక్, జపనీస్‌ టోసా, ఆకిటా, మాఇ్టఫ్స్, టెర్రియర్స్, రోడేషియన్‌ రిజ్డ్‌ బ్యాక్, వోల్ఫ్‌ డాగ్స్, కానరియో, ఆక్బాష్‌ డాగ్, మాస్కో గార్డ్‌ డాగ్, కేన్‌ కార్సో బ్యాండాగ్‌ ఉన్నాయి.