Young Heroes: మాస్ జపం చేస్తున్న యంగ్ హీరోలు.. స్టార్ హీరో అవ్వాలంటే మాస్ హీరో అవ్వాల్సిందేనా..?

ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరూ మాస్ హీరోగా సక్సెస్ అయిన తర్వాత స్టార్ హీరోలుగా గుర్తింపు పొందారు. ఇక అదే మాదిరిగా ప్రస్తుతం ఉన్న కొంతమంది యంగ్ హీరోలు కూడా మాస్ జపం చేస్తూ ముందుకు సాగుతున్నారు.

Written By: Gopi, Updated On : May 10, 2024 3:27 pm

ram pothineni double iSmart

Follow us on

Young Heroes: సినిమా ఇండస్ట్రీలో హీరోగా సక్సెస్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. ఇక్కడ అవకాశం రావడమే గొప్ప.. అలాంటి సమయంలో ఏదో ఒక చిన్న అవకాశమైతే వస్తుంది. ఇక దాన్ని సద్వినియోగపరుచుకొని హీరోగా ఎదగాలి అంటే ఓపిక ఉండాలి. టాలెంట్ ఉన్న లేకపోయినా కూడా ఓపిక అనేది ఉండకపోతే మాత్రం ఇక్కడ స్టార్ హీరోలుగా సక్సెస్ అవ్వడం చాలా కష్టం..

ఇక ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరూ మాస్ హీరోగా సక్సెస్ అయిన తర్వాత స్టార్ హీరోలుగా గుర్తింపు పొందారు. ఇక అదే మాదిరిగా ప్రస్తుతం ఉన్న కొంతమంది యంగ్ హీరోలు కూడా మాస్ జపం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక అందులో ముఖ్యంగా రామ్ మాస్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవడానికి ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సినిమా చేశాడు. అయితే ఈ సినిమాతో తను కొంతవరకు మాస్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఇక అదే విధంగా ఇప్పుడు ‘డబుల్ ఇస్మార్ట్’ అనే సినిమాతో మరోసారి మాస్ జపం చేస్తున్నాడు…

ఇక ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ కూడా మొన్నటిదాకా ఫ్యామిలీ సినిమాలు, లవ్ స్టోరీస్ ని చేస్తూ వచ్చాడు. కానీ రవి కిరణ్ డైరెక్షన్ లో ఇప్పుడు చేయబోయే సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక విజయ్ కూడా స్టార్ హీరో అవ్వాలంటే మాస్ ఆడియోన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకోవాలనే ఒక నిజాన్ని తెలుసుకున్నట్టుగా ఉన్నాడు.

అందుకే ఆయన కూడా మాస్ సినిమాలు చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో కొంతమంది విజయ్ పైన కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు. ఇక మొత్తానికైతే యంగ్ హీరోలందరూ మాస్ జపం చేయడం అనేది ఒక వంతుకు మంచి విషయమే అయినప్పటికీ అందరూ హీరోలు కూడా మాస్ సినిమాలు చేస్తుంటే ఇక మిగతా జానర్స్ లో సినిమాలు ఎవరు చేస్తారు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. చూడాలి మరి ఈ యంగ్ హీరోలు మాస్ ప్రేక్షకులని ఎంతవరకు మెప్పిస్తారు అనేది…