దేవాలయాలలో పని చేసే క్షురకులకు 10 వేలు అడ్వాన్స్

దేవాలయాల్లో పనిచేస్తున్న క్షురకులకు రూ. 10 వేలు అడ్వాన్స్ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన నేపధ్యములో కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా దేవాలయాలలో భక్తులకు శిరోముండనం చేస్తూ జీవనం సాగిస్తున్న క్షురకులు ఉపాధి లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని 8 ప్రముఖ దేవాలయాలలో పని చేస్తున్నా 517 మంది, 80 చిన్న దేవాలయాలలో 451 మంది కలిపి […]

Written By: Neelambaram, Updated On : April 3, 2020 7:17 pm
Follow us on


దేవాలయాల్లో పనిచేస్తున్న క్షురకులకు రూ. 10 వేలు అడ్వాన్స్ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన నేపధ్యములో కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా దేవాలయాలలో భక్తులకు శిరోముండనం చేస్తూ జీవనం సాగిస్తున్న క్షురకులు ఉపాధి లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని 8 ప్రముఖ దేవాలయాలలో పని చేస్తున్నా 517 మంది, 80 చిన్న దేవాలయాలలో 451 మంది కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 968 మంది క్షురకులు లబ్ది కలుగుతుందన్నారు. ప్రస్తుతం వీరికి ఉపాధి లేని కారణంగా కేశఖండన శాల JAC , వీరిని ఆర్ధికంగా ఆదుకొనమని అభ్యర్ధించినట్లు చెప్పారు. వీరి అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఏ దేవాలయం లో పనిచేసే క్షురకుడికి ఆ దేవాలయం నుంచి 10,000 రూపాయలు అడ్వాన్సు గా చెల్లించబడుతుంది. పరిస్థితులు చక్కబడిన రెండు నెలల తరువాత ఈ మొత్తాన్ని నెలవారీ సులభ వాయిదాల్లో సంబంధిత దేవాలయానికి జమ చేయడం జరుగుతుంది.