నేను చేసినట్టు ముస్లిం సోదరులు చేస్తే కరోనాని జయించవచ్చు’

లండన్ నుంచి రాష్ట్రానికి వచ్చిన ఒక తెలుగు కుర్రాడు కరోనాను జయించిన సంఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోట చేసుకుంది. ఇదే తరహాలో ఢిల్లీలోని ప్రార్ధనలకు వెళ్లిన ముస్లిం సోదరులు కూడా ఇలానే చేస్తే మంచిదనే సలహా ఇస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన 22 ఏళ్ల  యువకుడికి రెండు వారాల కిందట కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో వెంటనే అంబులెన్స్‌ కు కాల్ చేసి విషయం చెప్పమన్నాడు. వెంటనే స్పందించిన మెడికల్ సిబ్బంది […]

Written By: Neelambaram, Updated On : April 3, 2020 7:00 pm
Follow us on

లండన్ నుంచి రాష్ట్రానికి వచ్చిన ఒక తెలుగు కుర్రాడు కరోనాను జయించిన సంఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోట చేసుకుంది. ఇదే తరహాలో ఢిల్లీలోని ప్రార్ధనలకు వెళ్లిన ముస్లిం సోదరులు కూడా ఇలానే చేస్తే మంచిదనే సలహా ఇస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే..తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన 22 ఏళ్ల  యువకుడికి రెండు వారాల కిందట కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో వెంటనే అంబులెన్స్‌ కు కాల్ చేసి విషయం చెప్పమన్నాడు.

వెంటనే స్పందించిన మెడికల్ సిబ్బంది ఆ యువకుడ్ని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 13 రోజులు చికిత్స అనంతరం తనకు కరోనా నెగటివ్ గా నిర్థారణ అయినట్లు తెలిపాడు. కరోనాను జయించడంతో తనని వైద్యులు డిశ్ఛార్జి చేసినట్లు చెప్పాడు. కరోనాను జయించిన యువకుడిని జిల్లా  కలెక్టర్ మురళీదర్ రెడ్డి, ఎస్పీ నయీం ఆస్మీ, ప్రజాప్రతినిధులు అభినందించారు. కరోనా పాజిటివ్ వ్యక్తికి వైద్య సేవలు అందించి వైరస్ బారి నుంచి సురక్షితంగా కాపాడిన వైద్యులను అధికారులు అభినందించారు.

కరోనా రక్కసి నుంచి తన ప్రాణాలు కాపాడిన వైద్యులకు, అధికారులకు తెలిపాడు. కరోనా లక్షణాలు కనిపించిన తర్వాత సకాలంలో ఆసుపత్రికి వస్తే కరోనాను జయించవచ్చు అన్నాడు. తనకు లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య సిబ్బందికి సమాచారం ఇస్తే అంబులెన్స్‌ లో కాకినాడ ఆస్పత్రికి తరించి చికిత్స అందించారని, వారం రోజుల తర్వాత తన పరిస్థితి మెరుగైందని పూర్తిగా కోలుకునేందుకు రెండు వారాలు పట్టిందన్నాడు. ఇదే తరహాలో ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రార్ధనలకు వెళ్లిన ముస్లిం సోదరులు కూడా వెంటనే స్పందించి కరోనా పరీక్షలు చేయించుకుంటే.. మంచి ఫలితాలు వస్తాయని హితవు పలికాడు.