మారుతున్న కాలంతో పాటే దేశంలో ఫ్రిజ్ ను వినియోగించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆహార పదార్థాలు, కూరగాయలు ఎక్కువ సమయం నిల్వ ఉండాలనే ఉద్దేశంతో మనం ఫ్రిజ్ ను ఉపయోగిస్తాం. అయితే ఫ్రిజ్ ను వినియోగించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. మనలో చాలామంది ఫ్రిజ్ లో తక్కువ ఉష్ణోగ్రత ఉండటం వల్ల ఎలాంటి సూక్ష్మజీవులు పెరగవని భావిస్తూ ఉంటారు.
Also Read: రక్తంలో హిమో గ్లోబిన్ పెరగాలంటే తీసుకోవాల్సిన ఆహార పదార్థాలివే..?
అయితే ఫ్రిజ్ లో కూడా సాల్మోనెల్లా అనే సూక్ష్మజీవి పెరిగే అవకాశాలు ఉంటాయి. మాంసంను ఫ్రిజ్ లో నిల్వ చేస్తే ఈ సూక్ష్మజీవి పెరిగే అవకాశం ఉంటుంది. ఒక ఆహార పదార్థంపై ఈ సూక్ష్మ జీవి ఉందంటే ఇతర ఆహార పదార్థాలకు కూడా చేరి వాటిని నాశనం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాల్మోనెల్లా బ్యాక్టీరియా ఉన్న ఆహార పదార్థాలను వేడి చేసి తింటే ఎటువంటి సమస్య లేదు కాని సరిగ్గా వేడి చేయకపోతే మాత్రం డయేరియా, ఇతర ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది.
Also Read: పిల్లలకు పీడకలలు రాకూడదంటే ఏం చేయాలో తెలుసా..?
చాలామంది ఫ్రిజ్ ను శుభ్రం చేయడం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. అయితే కనీసం రెండు వారాలకు ఒకసారైనా ఫ్రిజ్ ను శుభ్రం చేస్తే మంచిది. డీప్ ఫ్రీజర్ లో చేయి పెడితే చల్లగాలి తగలకుండా చిత్తడిగా ఉందంటే వీలైనంత త్వరగా ఫ్రిజ్ ను రిపేర్ చేయిస్తే మంచిది. ఫ్రిజ్ లో మాంసం నిల్వ ఉంచితే అధిక ఉష్ణోగ్రత దగ్గర మాంసాన్ని ఉడికించాలి. ఫ్రిజ్ లో ఉంచిన కూరగాయలను తగిన ఉష్ణోగ్రత దగ్గర ఉడికించిన తర్వాత మాత్రమే తినాలి.
మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం
ఫ్రిజ్ లో వేర్వేరు ఆహార పదార్థాలను వేర్వేరుగా ప్యాక్ చేసి ఫ్రిజ్ లో ఉంచాలి. అలా చేయడం ద్వారా బ్యాక్టీరియా ఒకదాని నుంచి మరొకదానికి వ్యాపించే అవకాశం ఉండదు. హానికరం కాని ప్యాకింగ్ మెటీరియల్ ను ఫ్రిజ్ లో ఆహార పదార్థాలను నిల్వ చేయడం కోసం ఉపయోగిస్తే మంచిది.