ఈ శతాబ్ధంలోనే భీకరమైన సంవత్సరంగా 2020 అందరికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఈ ఏడాది ఎవరూ స్కూళ్లకు వెళ్లలేదు.. ఉద్యోగాలు చేయలేదు. అన్ని బంద్ చేసి ఇంట్లో ఖాళీగా కూర్చొని నరకం అనుభవించారు. చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచమే లాక్ అయిపోయిన దారుణ పరిస్థితులను 2020 మిగిల్చింది.
2020 అయిపోతోంది. ఈ సంవత్సరం పీడ వదిలిందనుకొని క్రిస్మస్ సంబరాలకు వివిధ దేశాల్లో.. మన దేశంలో రెడీ అవుతున్నారు.కానీ ఇంకా ప్రజలను 2020 ఊపిరి పీల్చుకోనీయడం లేదు. చివర్లో మరింతగా మరింతగా భయపెడుతోంది.
Also Read: గ్రేటర్లో సమస్యలను పట్టించుకునే నాథుడే లేడా?
2020 పీడకలను మిగులుస్తోంది. క్రిస్మస్ సంబరాలకు రెడీ అవుతున్న ఈ చివరి డిసెంబర్ నెలాఖరులో కూడా మరింతగా ప్రజలను భయపెడుతోంది. ఈ నెల ఆరంభంలోనే గుజరాత్ లోని గిర్ సోమనాథ్ జిల్లాలో రిక్టర్ స్కేలుపై 1.7 నుంచి 3.3 తీవ్రతతో 19 భూకంపాలు సంభవించాయి.జపాన్ లో అయితే ఈ ఇయర్ ఎండింగ్ లో భూకంపాలు భారీగా వస్తున్నాయి. అక్కడ సునామీ హెచ్చరికలు జారీ చేశారు. కరోనాతో అల్లాడిపోతున్న జనం ఈ భూకంపాల ప్రభావాన్ని సోషల్ మీడియా వేదికగా ‘ఇయర్ ఎండింగ్’ ఎఫెక్ట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. క్రిస్మస్ పండుగను పోలుస్తూ మీమ్స్ పెడుతున్నారు.
తాజాగా ఢిల్లీ నుంచి గురుగ్రామ్ లోని నోయిడా ఘజియాబాద్ వరకు ప్రకంపనలు సంభవించాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. భూకంప కేంద్రం రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో ఉన్నట్టు గుర్తించారు. భూమికి 5 కి.మీ.ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టుగా సిస్మోలజీ విభాగం వెల్లడించింది. ఆస్తి, ప్రాణ నష్టం సంభవించనప్పటికీ భూకంపకేంద్రం తక్కువ దూరంలో ఉండడంతో ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
Also Read: కేకలు వేసిన పిల్లోడు.. అభినందించిన ఎమ్మెల్యే..! విషయమెంటీ?
ఇవే కాదు.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భూకంపాలు తాజాగా సంభవిస్తున్నారు. గురువారం ఢిల్లీ ఎన్సీఆర్ లో రాత్రి 11.45 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. ప్రజలు భయపడి ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.2గా సంభవించింది. జమ్మూ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లోనూ స్వల్పప్రకంపనలు వస్తున్నాయి.
ఇలా 2020 వెళ్లిపోతూ కూడా జనాలతో టీట్వంటీ ఆడుతూనే ఉంది. ఈ ఇయర్ ఎండింగ్ క్రిస్మస్ పండుగ ముగిసేలోపే ఇంకా ఎన్ని ఉపద్రవాలు చూడాల్సి వస్తోందనని అందరూ భయపడుతున్నారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్