Pawan Kalyan On Puri Jagannadh: పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఏం చేసిన అదొక ట్రెండ్ గా నిలుస్తుంది. గబ్బర్ సింగ్ సినిమాలో చెప్పినట్టు గా పవన్ కళ్యాణ్ ట్రెండ్ ని ఫాలో అవ్వడు ట్రెండ్ సెట్ చేస్తాడు అనే డైలాగ్ ఆయనకి సరిగ్గా సరిపోతుంది.ఇక ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను కూడా అందుకున్నాయి.
అయితే ఆయన బద్రి సినిమాలో ఏదైతే మెడ దగ్గర చేయి పెట్టి స్టైలిష్ గా మెడని టచ్ చేస్తాడో అదే ఆయన మ్యానరిజం గా మారిపోయింది. ఇప్పుటికి కూడా ఆయన ప్రతి సినిమాలో అదే మ్యానరిజన్ని వాడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సి వచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్కరు చేయి ని అలా మెడ దగ్గరికి తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గురించి చెప్తూ ఉంటారు.
ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో పవన్ కళ్యాణ్ కి ఏ మ్యానరిజం లేదు. ఇక ఎప్పుడైతే పూరి జగన్నాథ్ తో బద్రి సినిమా చేశారో దాంట్లో పవన్ కళ్యాణ్ కి ఒక సపరేట్ మ్యానరిజం పెట్టాలని పూరి జగన్నాథ్ అనుకొని దాన్ని అలా సెట్ చేశారు. నిజానికి ఎప్పుడు పూరి జగన్నాధ్ మెడ దగ్గర చేయి పెట్టుకొని స్టైలిష్ గా అలా అంటూ ఉంటారు అది ఆయన మ్యానరిజం.ఇక ఈ సినిమాకోసం దాన్నే తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ కి ఆడ్ చేయడంతో బద్రి సినిమాలో అలా స్టైల్ గా కనిపించిన పవన్ కళ్యాణ్ అందరికీ విపరీతంగా నచ్చాడు.
ఇంకా అప్పటినుంచి అదే మ్యానరిజన్ని పవన్ కళ్యాణ్ రిపీట్ చేస్తూ వస్తున్నాడు. ముందుగా ఈ మ్యానరిజన్ని చేద్దామని పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ కి చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ అంత పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదంట కానీ పట్టుబట్టి మరి పూరి జగన్నాధ్ ఇది బాగుంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ చేత చేయించాడు. దాంతో అది ఎక్కువ ప్రేక్షకాధారణ పొందటం తో ఆయన అన్ని సినిమాలకి అదే మ్యనరిజన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. మొత్తానికి పూరి జగన్నాథ్ ఎలా అయితే పవన్ కళ్యాణ్ ని చూపించాలి అని అనుకున్నాడో అలా చూపించాడు.
అలాగే తనకు ఒక సపరేట్ మ్యానరిజన్ని కూడా సెట్ చేసి క్రియేట్ చేశారనే చెప్పాలి. ఇక పూరి జగన్నాథ్ కి పవన్ కళ్యాణ్ కి మధ్య మంచి సన్నిహిత్యం ఉంటుంది. అందుకే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన బద్రి సినిమా సూపర్ హిట్ అయింది. ఇక దాని తర్వాత కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా కూడా వచ్చింది. ఈ సినిమా యావరేజ్ గా ఆడింది…