Must-Know Fact for Alcoholics: మద్యం తాగడం వల్ల ఆరోగ్యానికి హానికరం అని ఎన్నో రకాలుగా వైద్యులు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు సూచిస్తున్న ఎవరూ పట్టించుకోవడం లేదు. రకరకాల కారణాలు చెబుతూ ఏదో రకంగా ప్రతిరోజు మద్యం తీసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అయితే మద్యం తాగే అలవాటు ఉన్న అది ఒక క్రమ పద్ధతిలో ఉండడం వల్ల శరీరానికి హాని చేయకుండా ఉంటుందని కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంటే మద్యం తీసుకోవాలి అని అనుకున్న వారు ఈ విధంగా చేయడం వల్ల వారి ఆరోగ్యానికి ఎటువంటి హాని చేయకుండా ఉంటుంది. మరి మధ్యలో ఎలా తీసుకోవాలి? ఏ విధంగా సేవించడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు?
మద్యం తీసుకున్న తర్వాత శరీరంలో జరిగే ప్రాసెస్ గురించి చూద్దాం. ముందుగా మద్యం తీసుకున్న తర్వాత అది నేరుగా లివర్ లోకి వెళుతుంది. ఇక్కడ ప్రాసెస్ అయిన తర్వాత మీరు మూత్రం ద్వారా బయటికి వెళ్తుంది. మిగతాది బ్లడ్ లో కలిసి పోతుంది. ఆ తర్వాత ఇది మెదడుకు చేరుతుంది. ఇలా మెదడుకు చేరిన తర్వాత మత్తు ప్రారంభమవుతుంది. అయితే ఇలా ఆల్కహాల్ తీసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ కావడానికి సమయం తీసుకుంటుంది. మరి ఈ సమయంలో ఏం జరుగుతుంది అంటే?
Also Read: ఈ 8 అలవాట్లకు బానిస అయితే…నువ్వు సక్సెస్ ఫుల్ వ్యక్తి అవుతావు
మద్యం సేవించిన తర్వాత లివర్ లోకి రాగానే ఇక్కడ లివర్ Alcohol Dehydrogen అనే ఎంజాయ్ ను రిలీజ్ చేస్తుంది. ఇది ఆల్కహాల్ ను ఎసిటాల్ డి హైడ్రోజన్ గా మారుస్తుంది. ఇది నీరు, ఆక్సిజన్ లాగా మారుస్తుంది. ఇందులో నీరు మూత్రం ద్వారా బయటకు వెళ్తుంది. ఆక్సిజన్ శ్వాస ద్వారా బయటకు వెళ్తుంది.
అయితే కడుపులో జరిగే ఈ ప్రాసెస్ సక్రమంగా జరగాలంటే లిమిట్లో మద్యం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక వన్ అవర్ కు 30 ఎంఎల్ మద్యం తీసుకుంటే ఈ ప్రాసెస్ సక్రమంగా జరుగుతుంది. కానీ మోతాదుకు మించి మద్యం సేవించడం వల్ల లివర్లో జామ్ అయిపోతుంది. ఇలా జామై ప్రాసెస్ కావడానికి సమయం తీసుకుంటుంది. దీంతో ఈ ప్రాసెస్ చక్రమంగా నిర్వహించలేక లివర్ డ్యామేజ్ అవుతుంది.
Also Read: భార్యాభర్తల మధ్య ఈ ఆలోచన అస్సలు రానీయకూడదు..
అలా ఓవర్ లోడ్ మద్యం సేవించడం వల్ల లివర్ ఓవర్ లోడ్ గా మారి డామేజ్ అవుతుంది. అయితే కేవలం ఆల్కహాల్ మాత్రమే లివర్ లో ఉండడం వల్ల ఈ సమస్య ఉండవచ్చు. అందువల్ల ఆల్కహాల్తో పాటు సరైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ డైజేషన్ మరింత స్పీడ్ గా జరిగే అవకాశం ఉంది. అందువల్ల మద్యం తీసుకునే సమయంలో కచ్చితంగా సరైన ఆహారం తీసుకుంటూ ఉండాలి. అది ఈజీగా డైజేషన్ అయ్యే ఫుడ్ అయితే ఇంకా మంచిది. మితంగా మద్యం సేవించడం వల్ల కాస్త రిలాక్స్ కావచ్చు. కానీ అతిగా సేవించడం వల్ల అనారోగ్యానికి గురై ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. అందువల్ల మద్యం సేవించేవారు ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి.