Capital City Expansion: అమరావతికి ( Amravati capital ) మరో గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. ఎన్ డి ఏ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. గతంలో రెండు సార్లు ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి విషయంలో ఇంత చొరవలేదు. కానీ ఈసారి రాజకీయ అవసరాల దృష్ట్యా అమరావతి రాజధాని నిర్మాణానికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తోంది. తాజాగా ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో అనుకూల నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయల సాయం ప్రకటించింది కేంద్రం. వార్షిక బడ్జెట్లో నిధులు కేటాయించింది. ప్రపంచ బ్యాంకు నిధుల నుంచి సర్దుబాటు చేసింది. కేంద్ర ప్రభుత్వ పరంగా రైల్వే, రవాణా ప్రాజెక్టులను సైతం కేటాయించింది. అయితే ఇప్పుడు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును 14 మీటర్ల వెడల్పుతో చేపట్టేందుకు కేంద్రం ఆమోదం తెలపడం విశేషం.
Also Read: ఏపీలో కొత్త జిల్లా.. ఎక్కడ ఏర్పాటంటే? ప్రభుత్వం కీలక ప్రకటన!
దేశంలోనే మోడల్ నగరం..
దేశంలోనే మోడల్ నగరంగా అమరావతిని నిర్మించాలన్నది చంద్రబాబు( CM Chandrababu) లక్ష్యం. 50 ఏళ్లలో పెరగనున్న ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకొని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును 150 మీటర్ల వెడల్పుతో నిర్మించాలని చంద్రబాబు పట్టు పట్టారు. అయితే 140 మీటర్లతో నిర్మించాలని కేంద్రం రాజా గారి నిర్ణయించడం విశేషం. వాస్తవానికి విజయవాడ తూర్పు బైపాస్ సాధ్యం కాదని గతంలోనే కేంద్రం తేల్చేసింది. అయితే దాని స్థానంలో అవుటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానించడానికి రెండు చోట్ల లింకు రోడ్ల నిర్మాణానికి మాత్రం అంగీకరించింది. మార్చి ఐదున జరిగిన అత్యున్నత సమావేశంలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి నితిన్ గడ్కరి రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే వాటికి సంబంధించిన వివరాలు మినిట్స్ రూపంలో ఇక్కడి అధికారులకు వచ్చాయి. దీంతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అడుగులు పడినట్టే.
మరో 70 మీటర్లు అదనం
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ( Amaravathi Outer Ring Road )నిర్మాణానికి సంబంధించి 70 మీటర్ల వెడల్పు చాలు అంటూ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అలైన్మెంట్ అప్రూవల్ ను గత డిసెంబర్ లోనే ఒక నిర్ణయానికి వచ్చింది. అయితే ఇప్పుడు మరో 70 మీటర్ల వెడల్పును కలుపుతూ.. 140 మీటర్లు వెడల్పుతో చేపట్టేందుకు నిర్ణయించింది. ఇందుకు అవసరమయ్యే భూసేకరణ వ్యయంలో రూ.1000 కోట్లు వెచ్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అయితే ఇప్పటివరకు 70 మీటర్ల వెడల్పుతోనే అవుటర్ రింగ్ రోడ్డు కు ఐదు జిల్లాల్లో భూసేకరణ ప్రారంభించారు. అయితే ఇప్పుడు అది 140 మీటర్ల వెడల్పుకు మారడంతో.. దానికి అనుగుణంగా చర్యలు చేపట్టనున్నారు.
Also Read: నిరుద్యోగులకు అలెర్ట్ : మెగా డీఎస్సీ 2025 పై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
పశ్చిమ బైపాస్ తుది దశకు.. విజయవాడ( Vijayawada) పశ్చిమ వైపున బైపాస్ నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఇప్పుడు తూర్పు వైపు నాలుగు వరుసలతో బైపాస్ నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే ఇది అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కు సమాంతరంగా ఉన్నందున.. తూర్పు బైపాస్ వద్దని కేంద్రం నిర్ణయించింది. దీనికి ప్రత్యామ్నాయంగా చెన్నై- కోల్కత్తా నేషనల్ హైవే 16 పై ఖాజా వద్ద ముగిసే.. విజయవాడ పశ్చిమ బైపాస్ నుంచి తెనాలి సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు వరకు 17.5 కిలోమీటర్ల మేర లింక్ రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపింది కేంద్రం. గుంటూరు శివారులోని బుడంపాడు వద్ద ఎన్ హెచ్ 16 నుంచి నారాకోడూరు సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు వరకు.. ఐదు పాయింట్ రెండు కిలోమీటర్ల మేర మరో లింకు రోడ్డు నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తానికి అయితే అమరావతికి మరో గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం.