Husband and Wife: దాంపత్య జీవితం అందమైనది. కానీ ఇది ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే ఎన్నో ఒడిదుడుకులు, కష్ట నష్టాలు ఎదుర్కొంటూ ముందుకు పోవాలి. ఒకరికి తెలియకుండా మరొకరు ఉన్న సమయంలో ఇద్దరు కలిసి జీవితంలో ప్రయాణం చేయడానికి వివాహం అనే బంధంతో ఒకటవుతారు. ఇలా ఒకటైన వారు ఏ విషయంలోనైనా ఒకటిగానే ఆలోచన చేయాలి. అంతేకాకుండా ఎప్పుడు మంచి విషయాల గురించి మాట్లాడుతూ ఉండాలి. చెడు విషయాల గురించి ఎప్పుడూ చర్చించ కూడదు. భార్యాభర్తల మధ్య జరిగే చర్చలు కుటుంబంలోని వాతావరణాన్ని తెలుపుతాయి. వీరి మధ్య మంచి చర్చలు జరుగుతే వారి కుటుంబం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. అయితే మంచి చర్చలు అంటే ఎలా ఉంటాయి? ఎలాంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించాలి?
కొన్ని కుటుంబాల్లోని భార్య లేదా భర్త ఎప్పుడు నెగిటివ్ విషయాలే మాట్లాడుతారు. తమకు ఉన్న సంపద గురించి మాట్లాడుకోకుండా.. తమకు ఇంకా ఏదో కావాలంటూ ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇద్దరి మధ్య ఈ విషయం ఒక్కోసారి చిలికి చిలికి పెద్దగా గాలివానగా మారి అవకాశం ఉంటుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు వచ్చి దూరం పెరిగే అవకాశం కూడా ఉంది. అందువల్ల భార్యాభర్తల్లో ఎవరో ఒకరు పాజిటివ్ థింకింగ్ అనేది ఉండాలి. అయితే ఇలా లేనిదాని గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మనసు ప్రశాంతత కోల్పోతుంది. దీంతో ఏ పని చేయకుండా ఉండిపోతారు.
Also Read: బిగ్ బాస్ షోలోకి రోబో ఎంట్రీ..’స్క్విడ్ గేమ్స్’ రేంజ్ లో ప్లాన్ చేశారుగా!
కొందరు పెద్దలు చెప్పిన ప్రకారం.. తధాస్తు దేవతలు ఉంటారని చెబుతారు. అంటే మనం ఎలాంటి విషయాలు మాట్లాడితే మన జీవితం కూడా అలాగే ఉంటుందని వారి మాటల్లో అర్థం ఉంది. అందువల్ల మనం ఎప్పుడూ మంచి గురించే ఆలోచించడం వలన తధాస్తు దేవతలు సైతం మంచే జరగాలని కోరుకుంటారట. మనం చెడు విషయాల గురించి ఆలోచిస్తే చెడే జరుగుతుందని చెబుతుంటారు.
కొందరు తమకు డబ్బు లేదని ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు. అయితే తమకు ఎంత డబ్బు ఉంది ఇంకా ఎంత కావాలి? అనే విషయాలనుప్రణాళిక బద్ధంగా ఆలోచించాలి. అలా కాకుండా డబ్బు బాగా ఉన్న ఇంకా కావాలి అంటూ ఎప్పటికీ బాధపడే వారి ఇంట్లో దరిద్ర దేవతే తాండవిస్తుందని అంటుంటారు. ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవాళ్లు ఎప్పుడూ సంతోషంగా ఉండడంతోనే ఇల్లు ప్రశాంతంగా మారుతుంది. అలా కాకుండా స్థాయికి మించిన కోరికలు ఉండడంవల్ల ఆందోళనగా మారుతుంది.
అయితే భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరో ఒకరు ఇలా ఆలోచించవచ్చు. మరొకరు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేయాలి. అప్పటికే వినకపోతే కొన్ని రోజులపాటు వెయిట్ చేసి వారికి అర్థమయ్యే విధంగా వివరించాలి. ఇలాంటి సమయంలో ఇద్దరి మధ్య గొడవలు ఏర్పడే అవకాశం ఉంది. ఆ గొడవలను పెంచుకోకుండా చిన్నగా ఉన్నప్పుడే.. తుంచే ప్రయత్నం చేయాలి. లేకుంటే ఈ గొడవల ప్రభావం పిల్లలపై కూడా పడే అవకాశం ఉందని కొందరు మానసిక నిపుణులు తెలుపుతున్నారు.