Drinking Water: తగినంత నీరు తాగడం లేదా? ఓ సారి ఇది చదవండి..

Drinking Water: ఎలాంటి సమస్య లేకుండా మీకు తలనొప్పి వస్తే మీ శరీరంలో నీరు తక్కువ ఉందని అనుకోవాలట. శరీరం డీహ్రైడేషన్‌కు గురైనప్పుడు మెదడులో రక్త ప్రవాహం, ఆక్సిజన్ లభించదు కాబట్టి తలనొప్పి వస్తుంటుదట.

Written By: Swathi, Updated On : May 27, 2024 12:30 pm

Not drinking enough water

Follow us on

Drinking Water: బతకడానికి ఆహారం ఎంత ముఖ్యమూ నీరు కూడా అంతే ముఖ్యం. ఇది కేవలం మనుషులకు మాత్రమే కాదు జంతువులకు, పక్షులకు కూడా ఇదే వర్తిస్తుంది. అందుకే రోజు సరిపడ నీరు తాగాలి. ఇలా నీరు తాగడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు. మనకు వచ్చే సగం వ్యాధులకు నీరు తాగకపోవడమే కారణమని అంటారు నిపుణులు. ఇక సమ్మర్ లో శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంటుంది. ఈ సమయంలో నీరు తీసుకోకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయట. అయితే మీ శరీరంలో తగినంత నీరు లేదని కొన్ని లక్షణాలు మనకు ముందే అలర్ట్ ఇస్తుంటాయి. మరి అవేంటో తెలుసుకుందామా?

ఎలాంటి సమస్య లేకుండా మీకు తలనొప్పి వస్తే మీ శరీరంలో నీరు తక్కువ ఉందని అనుకోవాలట. శరీరం డీహ్రైడేషన్‌కు గురైనప్పుడు మెదడులో రక్త ప్రవాహం, ఆక్సిజన్ లభించదు కాబట్టి తలనొప్పి వస్తుంటుదట. అయితే డీహైడ్రేషన్‌కు(Dehydration) గురైన సమయంలో ఆకలి ఎక్కువగా అవుతుంటుంది. ఇలా అయితే తెలియకుండానే ఎక్కువగా తినేస్తుంటారు.

నోటి నుంచి దుర్వాసన ఎక్కువ కాలంగా వస్తుంటే కూడా మీరు తగినంత నీరు తీసుకోవడం లేదని నిర్ధారించుకోవాలట. తక్కువ నీరు తాగడం వల్ల గొంతు పొడి బారుతుంటుంది. దీని వల్ల నోటి లోపల బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. దీని వల్ల నోటి దుర్వాసన ఎక్కువ అవుతుంది. శరీరం డీహైడ్రేషనకు గురైన సమయంలో శరీరంలో ప్లాస్మా కౌంట్ తక్కువ అవుతుంది అంటున్నారు నిపుణులు. రక్త ప్రవాహం కూడా పెరుగుతుంది. దీని కారణంగా గుండె కొట్టుకోవడం వంటి సమస్యలు పెరుగుతాయి.

చర్మం పొడిబారే సమస్య కూడా శరీరంలో నీటి కొరత వల్లే వస్తుందట. చర్మంపై గీతలు(Scratches on Skin), ముడతలు పడడం కూడా జరుగుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మీరు డీహైడ్రేషన్‌తో బాధ పడుతున్నట్టు. అంతేకాదు ఎంత ఆహారం తీసుకున్నా నీరసంగా ఉంటున్నారంటే కూడా మీ శరీరంలో తగినంత నీరు లేదు అని అర్థం చేసుకోవాలి. అంతేకాదు డీహైడ్రేషన్‌ మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందట. తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణం అవదు. పేగు కదలికలు సరిగ్గా ఉండక మల బద్ధకం సమస్య వస్తుంది. మరి ఇన్ని సమస్యలకు కారణం అయ్యే నీరును తీసుకోవడం బెటరే కదా. అతిగా నీరు తీసుకోవడం వల్ల కూడా సమస్యలు వస్తాయి అంటారు నిపుణులు. కాస్త జాగ్రత్త సుమ..

Coffee: ఈ సమస్యలు ఉన్నా కూడా కాఫీ తాగుతున్నారా? అయితే మీరు డేంజర్ జోన్ లో ఉన్నట్టే..

Milk: ఈ పాలు తాగుతున్నారా? దారుణమైన సమస్యలు వస్తాయి?