https://oktelugu.com/

Salaar 2 : సలార్ 2 ఆగిపోయిందా..? దానికి కారణం ఏంటి..?

Salaar 2 : అయితే ప్రభాస్ గురించి ఎందుకు ఇలా చాలామంది నెగిటివ్ ప్రచారాన్ని చేస్తున్నారు అనేది మాత్రం తెలియడం లేదు.

Written By:
  • NARESH
  • , Updated On : May 27, 2024 / 12:32 PM IST

    Salaar 2

    Follow us on

    Salaar 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను అయితే క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇప్పటికే తను పాన్ ఇండియాలో వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. కానీ తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న వరుస సినిమాలు ప్రేక్షకులను అలరించడమే కాకుండా మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంటున్నాయి.

    ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన సినిమాలను తీసి సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకుంటున్నాడు. ఇక రీసెంట్ గా చేసిన సలార్ సినిమా సూపర్ సక్సెస్ అయింది. అయితే ఈ సినిమాకి సెకండ్ పార్ట్ కూడా ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ సెకండ్ పార్ట్ కోసం ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ ని కూడా ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. మరి ఇలాంటి క్రమంలో సలార్ 2 సినిమా ఆగిపోయింది అనే వార్తలైతే వస్తున్నాయి. ఇక దానికి కారణం ఏంటి అనేది క్లారిటీగా తెలియనప్పటికీ సలార్ 2 సినిమా మీద కొన్ని రూమర్లైతే బయటకు వచ్చాయి. ఇక ఇదిలా ఉంటే సినిమా యూనిట్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది.

    అయితే సినిమా ఆగిపోయింది అనేది కేవలం రూమర్ మాత్రమే, ఇప్పుడు సినిమా షూటింగ్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది శరవేగంగా జరుగుతుందంటూ సినిమా యూనిట్ నుంచి ఒక సమాధానమైతే వచ్చింది. అయితే ప్రభాస్ గురించి ఎందుకు ఇలా చాలామంది నెగిటివ్ ప్రచారాన్ని చేస్తున్నారు అనేది మాత్రం తెలియడం లేదు.

    ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి అటు ప్రశాంత్ నీల్, ఇటు ప్రభాస్ ఇద్దరూ కూడా భారీ సక్సెస్ ని తమ ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఇప్పటికే సలార్ సినిమాతో దాదాపు 700 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టారు. చూడాలి మరి ఈ సినిమాతో వీళ్ళు ఇంకెన్ని రికార్డ్ లను క్రియేట్ చేస్తారు అనేది…