https://oktelugu.com/

Milk: ఈ పాలు తాగుతున్నారా? దారుణమైన సమస్యలు వస్తాయి?

పాలు తాగడం పట్ల పలు జాగ్రత్తలు, సూచనలు చేస్తున్నారు నిపుణులు. పాల వ్యాపారంలో అధిక ఆదాయాలను ఆశిస్తూ పశువులకు సేపు ఇంజక్షన్లు వేస్తున్నారట.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : May 25, 2024 1:02 pm
    Milk

    Milk

    Follow us on

    Milk: యువ రైతులు వ్యవసాయంలో రాణించాలి అని వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు సక్సెస్ అయితే కొందరు ఫెయిల్ అవుతున్నారు. ఇక కొందరు బర్రెలు ,ఆవులు వంటి వాటిని ఆధారంగా చేసుకుని పాల డైరీని ప్రారంభిస్తూ కూడా వ్యాపార రంగాల్లో రాణిస్తున్నారు. అధిక సంపాదన రావాలని.. లాభాలను పొందాలని పశువులకు సూదులను వేస్తూ అధిక పాల దిగుబడిని సాధిస్తుంటారు. మరి ఈ సూదులు వేయడంతో ఎంత నష్టం వాటిల్లుతుందో తెలుసా?వాటిని తాగడం వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

    పాలు తాగడం పట్ల పలు జాగ్రత్తలు, సూచనలు చేస్తున్నారు నిపుణులు. పాల వ్యాపారంలో అధిక ఆదాయాలను ఆశిస్తూ పశువులకు సేపు ఇంజక్షన్లు వేస్తున్నారట. కానీ ఇవి సరైనవి కావు అంటున్నారు. పశువుకు సేపు ఇంజక్షన్స్ వేస్తే.. ఆ మందు పాల రూపంలో బయటకు వస్తుందట.

    ఆ పాలను చిన్నారులు,పెద్దలు తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయి అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మహిళలు, చిన్నారుల శరీరాల్లో అనేక రకాల మార్పులు సంభవిస్తాయట. అలాగే పశువులు కూడా పునర్ ఉత్పత్తిలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటాయట. కొన్ని సార్లు దూడ పుట్టిన తర్వాత ఆరోగ్యంగానే ఉండి ఆవు పాలు, బర్రె పాలు తాగిన తర్వాత చనిపోతుంది. దానికి కారణం కూడా ఈ సేఫ్ ఇంజక్షన్లు అంటున్నారు నిపుణులు. ఈ పాలు తాగడం వల్ల మహిళల్లో కూడా పునర్ ఉత్పత్తిలో తీవ్రమైన ఇబ్బందులు వస్తాయట.

    మరీ ముఖ్యంగా అండాశయాలలో కూడా సమస్యలు వస్తాయట. జననేంద్రియాలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి అని హెచ్చరిస్తున్నారు. చిన్న వయసులలోనే రజస్వలం కావడం జరుగుతుందట. అండాశయాల్లో నీటి బుడగలు ఏర్పడటం తరువాత పీసీఓడీ వంటి సమస్యలు కూడా వస్తుంటాయట. ఇలా సూదులు వేసిపశువుల నుంచి తీసిన పాలు తాగటం ప్రమాదకరం కాబట్టి ఇలాంటి పాలను అసలు తాగకూడదు. సూదులు వేసి పాలను పొందడం కంటే మంచి దానా పెట్టి పశువులకు ఎక్కువ పాలు వచ్చేలా చేయడం వాటి నుంచి లాభాలు పొందడం వల్ల తాగే వారికి అమ్మేవారికి మంచిది అని సలహా ఇస్తున్నారు నిపుణులు.