మనలో చాలామంది తాము చాలా ఆరోగ్యంగా ఉన్నామని భావిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో పరీక్షలు చేయించుకుంటే మాత్రమే ఆరోగ్యంగా ఉన్నామో లేదో తెలుస్తుంది. అయితే చేతి గోర్ల ద్వారా కూడా ఆరోగ్యంగా ఉన్నామో లేదో సులభంగా తెలుసుకోవచ్చు. ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉండే చేతి గోర్లు మనలో ఉన్న ఆరోగ్య సమస్యలను మనకు తెలిసేలా చేస్తాయి. వేలి గోర్లపై అర్ధ చంద్రాకారంలో ఒక ఆకారం ఉంటుంది.
మనలో చాలామందికి చేతి వేలిపై కనిపించే ఆ అర్ధ చంద్రాకారాన్ని లునులా అంటారు. అత్యంత సున్నితమైన భాగాలలో ఒకటైన లునులా విషయంలో చాలమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. శాస్త్రవేత్తలు లునులా దెబ్బ తింటే ఆ ప్రభావం గోర్ల పెరుగుదలపై పడుతుందని.. గోరు రంగును బట్టి ఆరోగ్య సమస్యలను తెలుసుకోవచ్చని చెబుతున్నారు. అయితే కొంతమందికి చేతి గోర్లపై లునులా కనిపించదు.
లునులా కనిపించని వారు పౌష్టికాహార లోపం లేదా రక్తహీనత సమస్యతో బాధ పడే అవకాశం ఉంటుంది. లునులా పూర్తిస్థాయి తెలుపు రంగులో ఉన్నా లేక నీలం రంగులో ఉన్నా డయాబెటిస్ బారిన పడే అవకాశాలు ఉంటాయి. అలా ఉన్నవారు ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకుంటే మంచిది. ఎరుపు లేదా పసుపు రంగు మచ్చలు ఉంటే గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది.
లునులా విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఇబ్బందులు పడక తప్పదు. లునులా మరీ చిన్నగా ఉంటే అజీర్తి సమస్యతో బాధ పడుతున్నట్టు అర్థం.