
న్యూ ఇయర్ కు.. సంక్రాంతికి అందరూ అప్ డేట్ ఇచ్చేశారు.. నేను ఏం పాపం చేశానని నిలదీస్తున్నారు మెగా స్టార్ చిరంజీవి. ఆయన హీరోగా దిగ్గజ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య’.
ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ను పొరపాటున ఓ సినిమా వేడుకలో అనౌన్స్ చేసి దర్శకుడు కొరటాలకు, చిత్రం యూనిట్ ను నిరాశపరిచిన చిరంజీవి.. తాజాగా తన ‘ఆచార్య’ మూవీనుంచి కనీసం ఒక్క అప్ డేట్ కూడా ఇవ్వని దర్శకుడు కొరటాలపై సెటైర్లు వేశాడు.
తాజాగా కొరటాలతో భేటి అయిన చిరంజీవి మూవీ కొన్ని మీమ్స్ తయారు చేసి కొరటాలపై సెటైర్లు వేశారు. ఆచార్య నుంచి అప్ డేట్ ఇవ్వని కొరటాలను చిరంజీవి ‘ఎమయ్యా కొరటాల నా సినిమాకి అప్ డేట్ లేదు. నువ్వు ఇవ్వకపోతే నేనే లీక్ చేయడానికి రెడీగా ఉన్నా’ అని అంటాడు..
దీనికి రేపు ఉదయం ఖచ్చితంగా దీనిపై ప్రకటన చేస్తానని కొరటాల శివ బదులిస్తాడు. ఈ మీమ్ ను రూపొందించి చిరంజీవి బయటకు వదిలాడు.. అదిప్పుడు వైరల్ గా మారింది.