Homeఅత్యంత ప్రజాదరణఎన్నికల విషయంలో జగన్ తగ్గింది ఇందుకేనా?

ఎన్నికల విషయంలో జగన్ తగ్గింది ఇందుకేనా?

ఏపీలో స్థానిక సంస్థల వేడి ఎట్టకేలకు రాజుకుంది. నిమ్మగడ్డతో ఫైట్ లో ఓడిపోయిన ఏపీసీఎం జగన్ ఎట్టకేలకు తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికలకు సై అన్నాడు. అంత పట్టుదలగా ఉన్న జగన్ ఒకేసారి సై అనడం చర్చనీయాంశమైంది. ఆయన నిశ్శబ్దానికి కారణం అదేనా..? పట్టువీడి ఏపీ సీఎం.. మరో వ్యూహం రచిస్తున్నారా..? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానాలే వస్తున్నాయి.

గతేడాది కరోనా ప్రారంభంలో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల వివాదం మొదలైంది. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఇప్పడే ఎన్నికలు వద్దని ఎస్ఈసీ నిమ్మగడ్డ వాయిదా వేశారు. ఈ క్రమంలో లాక్ డౌన్ తరువాత.. ఏడాదికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఈ క్రమంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ బాబు ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తూ.. ఓ ప్రకటన విడుదల చేశారు. దీన్ని.. ప్రభుత్వం వ్యతిరేకించింది. వ్యాక్సినేషన్ సమయంలో.. స్థానిక సంస్థల ఎన్నికలు సరికాదని సూచించింది. దీంతో ఎస్ఈసీకి అనువుగా హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీనికి దీటుగా ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. కరోనా వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు వద్దని ఫిల్ వేసింది. అయితే రాజ్యాంగ నిర్ణయాన్ని మార్చరాదని చెప్పిన సుప్రీం.. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత వాయిదా వేయడం కుదరదని తేల్చి చెప్పింది.

ఏపీ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సుప్రీం కోర్టు తీర్పు తరువాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నిన్నటి వరకు గర్జించిన ఇరు పక్షాల గొంతులు ఇప్పడు మూగబోయాయి. ఎన్నికలు వద్దన్న సీఎం జగన్ నిర్వహించి తీరుతామని.. పట్టుపట్టిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏకాభిప్రాయానికి వచ్చేశారు. ఇప్పడు ఇద్దరూ ఒకే డిమాండ్ తో కేంద్రానికి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. అయితే తుఫాను ముందు ప్రశాంతత నెలకొన్నట్లు.. ఏపీలో ప్రశాంత వాతావరణం ఏర్పడింది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు ఇద్దరిని ఇరకాటంలోకి నెట్టింది.

నిన్న మొన్నటిదాక ఎలాగైనా ఎన్నికలు నిర్వహిస్తామని తేల్చి చెప్పిన నిమ్మగడ్డ.. వద్దని పట్టుపట్టిన ప్రభుత్వం.. ఇప్పడు ఎన్నికల నిర్వహణకు వచ్చేసరికి చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. ఎన్నికల షెడ్యూలు మారడంతో రెండుమూడు రోజుల వరకు.. ఏం చేయలేని పరిస్థితి. ప్రస్తుతం ఏపీలో వ్యాక్సినేషన్ నడుస్తోంది. ఇదే సమయంలో పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. రెండు కార్యక్రమాలకు సిబ్బంది అవసరమే.. ఇప్పడు ఏపీలో ఇదే సమస్యగా మారింది. ఈ క్రమంలో ఎస్ఈసీ నూతన దారులు వెతుక్కోవలసిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వ్యాక్సినేషన్, పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఒకేసారి తమవల్ల కాదని చెబుతున్నారు.

ఇన్నాళ్లు పంచాయతీ ఎన్నికల విషయంలో పోటీ పడిన ఎస్ఈసీ.. జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు సిబ్బంది విషయంలో ఏకాభిప్రాయానికి వస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బంది నాలుగు విడతల్లో ఎన్నికల నిర్వహణకు సరిపోరు. ఈ క్రమంలో అదనపు సిబ్బంది అవసరమని.. లేకుంటే ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఇరువురూ చెతులెత్తేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో సిబ్బంది వ్యవహారంపై తేల్చడానికి తొలి విడత ఎన్నికలకు రెండు రోజుల సమయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణకు కేంద్రం నుంచి అదనపు సిబ్బంది, బలగాలు కావాలని సీఎం జగన్, ఎస్ఈసీ లేఖలు రాశారు. వీరిద్దరు రాసిన లేఖలను కేంద్రం రెండు రోజుల్లో పరిగణలోకి తీసుకోకుంటే.. వ్యాక్సినేషన్ లేదా.. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఒకవేళ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయినా.. తమకు వచ్చే నష్టం ఏం లేదని వైసీపీ నాయకులు అంటున్నారు. కేవలం ప్రజలు, ఉద్యోగుల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికలకు వ్యతిరేకించామని తెలిపారు. తమ పార్టీ ప్రవేశ పెడుతున్న పథకాలు… గ్రామస్థాయిలో తాము అందిస్తున్న పాలనతో స్థానిక సంస్థల్లోనూ ప్రజలు తమకే పట్టం కడతారని వైసీపీ నాయకులు అంటున్నారు. ఎన్ని కుట్రలు పన్నినా.. తెలుగుదేశంకు పాతాలానికి దిగజారడం ఖాయమని జోష్యం చెబుతున్నారు. మొత్తం ఎన్నికలు జరిగినా వైసీపీకే లాభం అని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కిందపడ్డా.. వెనక్కి తగ్గినా అధికార బలంతో వైసీపీకే పంచాయితీ ఎన్నికల్లో లాభం అని జగన్ వెనక్కితగ్గినట్టుగా తెలుస్తోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version