https://oktelugu.com/

milk : పాలు ఇన్ని రకాలా? మీరు ఒకసారి అయినా తాగారా?

ఈ బాదం పాలు అనుకూలంగా ఉంటాయి. బాదం తినేవారికి ఏదైనా అలెర్జీ ఉన్నవారు ఈ పాలను తీసుకోకుండా ఉండాలి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 5, 2024 / 07:05 AM IST

    milk

    Follow us on

    milk : పాలు తాగడం వల్ల చాలా మేలు జరుగుతుంది. పాలు సంపూర్ణ ఆహారం అంటారు నిపుణులు. అందుకనే పుట్టిన శిశివుకి పాలను ఇస్తారు. కొన్ని నెలల పాటు పాలు మాత్రమే వారికి ఆహారం. పాలు పిల్లల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు శారీరక ఎదుగుదలకు సహాయపడుతుంది. పాలలో కాల్షియం ఉండటం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్లు అధిక పరిమాణంలో ఉంటాయి. ఇది కండరాలను అభివృద్ధి చేయడంలో, మరమ్మత్తు చేయడంలో సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని అందిస్తుంది. చర్మం, జుట్టుకు కూడా ప్రయోజనకరం పాలు. అయితే అనేక రకాల పాలు ఒకేలా కనిపిస్తాయి. కానీ వాటి పోషణలో మాత్రం తేడా ఉంటుంది. ప్రతి ఒక్కరు తమ శరీరాన్ని బట్టి పాలను తీసుకోవాలి. ఈ రోజు పాలు ఎన్ని రకాలు, ఏ పాలు ఎవరికి మంచివి అనే వివరాలు తెలుసుకుందాం..

    ఆవు పాలు: ఆవు పాలను చాలా మంది తీసుకుంటారు. ఆవు పాలు ప్రోటీన్ ఉత్తమ మూలంగా పరిగణించబడుతుంది. హెల్త్‌లైన్ ప్రకారం 240 ml పాలలో 149 కేలరీలు, 8 గ్రాముల ప్రోటీన్, కొవ్వు, 12 గ్రాముల పిండి పదార్థాలు, 24% విటమిన్ D, 28% కాల్షియం, 26% రిబోఫ్లావిన్, 22% ఫాస్పరస్, 18% విటమిన్ B12, 13% సెలీనియం, 10% పొటాషియం లభిస్తుంది.

    సోయా పాలు: సోయా పాలు కూడా ప్రోటీన్ కు మంచి మూలం. అంతేకాదు సోయా పాలల్లో 6 గ్రాముల ప్రోటీన్, 12 గ్రాముల పిండి పదార్థాలు, 105 కేలరీలు, 4 గ్రాముల కొవ్వు, 34% విటమిన్ B12, 30% కాల్షియం, 26% రైబోఫ్లేవిన్, 26% విటమిన్ D, 10% ఫాస్పరస్ లు ఉంటాయి.

    వోట్స్ పాలు: ఈ వోట్ మిల్క్ లో 240-మి.లీ సర్వింగ్‌లో 120 కేలరీలు, 16 గ్రా పిండి పదార్థాలు, 2 గ్రా ఫైబర్, 5 గ్రా కొవ్వు, 3 గ్రా ప్రోటీన్, 22% ఫాస్పరస్, 18% విటమిన్ డి, A 50% విటమిన్ బి12, 46% రిబోఫ్లావిన్, 27% కాల్షియం, వంటి విటమిన్ పోషకాలు లభిస్తాయి.

    మేక పాలు: మేక పాలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందని భావిస్తారు. హెల్త్‌లైన్ ప్రకారం ఒక కప్పు పచ్చి మేక పాలలో 146 కేలరీలు, 8 గ్రాముల ప్రోటీన్, 7.81 గ్రాముల కొవ్వు, 11.4 గ్రాముల ఇనుము, 23% కాల్షియం, 8% పొటాషియం, 26% విటమిన్ B2 మరియు 55% విటమిన్ B12 ఉన్నాయి.

    A2 పాలు: A2 పాలు అనేది ఒక రకమైన దేశీ గిరి ఆవు పాలు. ఈ పాలల్లో A2 ప్రోటీన్ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. ఇవి A2 ప్రొటీన్‌ను మాత్రమే ఉత్పత్తి చేసే ఆవుల నుంచి వస్తాయి. A1 ప్రోటీన్‌ ఈ పాలల్లో ఉండదు. ఆవు పాలకు అలెర్జీ ఉన్న వ్యక్తులు ఈ పాలకు కూడా దూరంగా ఉండటం మంచిది.

    బాదం పాలు: బాదంపప్పును నీళ్లలో నానబెట్టి మిక్సీ చేస్తారు. ఆ తర్వాత వడగట్టి బాదం పాలను తయారుచేస్తారు. అయితే 240-మి.లీ పాలలో 41 కేలరీలు, 3 గ్రాముల కొవ్వు, 50% విటమిన్ ఇ 1 గ్రాము ప్రోటీన్, 2 గ్రాముల పిండి పదార్థాలు, ఉన్నాయి. నార్మల్ పాలకు అలర్జీ వచ్చే వారు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ బాదం పాలు అనుకూలంగా ఉంటాయి. బాదం తినేవారికి ఏదైనా అలెర్జీ ఉన్నవారు ఈ పాలను తీసుకోకుండా ఉండాలి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు..