https://oktelugu.com/

women : కోమాలో ఉన్నప్పుడు మహిళలకు పీరియడ్స్ వస్తాయా?

వాళ్లు దేనిని కూడా ఫీల్ కాలేరు. ఏదీ వినలేరు, చూడలేరు. కానీ ఎప్పటిలాగే పీరియడ్స్ మాత్రం కంటిన్యూ అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : October 5, 2024 / 06:02 AM IST

    Do women get periods while in a coma

    Follow us on

    women : పీరియడ్స్ అనేవి అమ్మాయిలకు సాధారణం. అయితే నెలసరి అనేది గర్భం దాల్చినప్పుడు మాత్రమే ఆగుతుంది. వయస్సు పెరిగిన తర్వాత మోనోపాజ్ దశ వచ్చినప్పుడు పూర్తిగా ఆగిపోతాయి. కొందరికి అనారోగ్య సమస్యల వల్ల కొన్నిసార్లు ఆగుతుంది. అయితే అమ్మాయిలకు ఏదైనా పెద్ద ప్రమాదం జరిగితే కొన్నిసార్లు కోమాలోకి వెళ్లిపోతారు. కోమాలోకి వెళ్లిపోతే ఇక వాళ్లకి స్పర్శ కూడా ఉండదు. అసలు పూర్తిగా ఏం చేయలేరు. అయితే కొందరికి కొన్ని సందేహాలు ఉన్నాయి. కోమాలోకి వెళ్లిన వాళ్లు ఇంకా చచ్చిన మనిషితో సమానం. ఏదో ప్రాణం ఉంటుంది తప్ప వాళ్లు ఏ పని చేయలేరు. కనీసం వాళ్ల పనులు కూడా చేసుకోలేరు. సాధారణంగానే అమ్మాయిలు పీరియడ్స్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాళ్ల పనులు చేసుకోవడానికి కూడా వారికి ఓపిక ఉండదు. అలాంటిది కోమాలో పీరియడ్స్ ఎలా? అసలు కోమాలోకి వెళ్లిన అమ్మాయిలకి పీరియడ్స్ వస్తాయా? రావా? ఒకవేళ వస్తే రుతుస్రావం అవుతుందా? లేదా? అని చాలామంది సందేహ పడుతున్నారు. ఇంతకీ కోమాలో అమ్మాయిలకి పీరియడ్స్ వస్తాయా లేదా అని పూర్తి వివరాల్లో తెలుసుకుందాం.

    కోమాలోకి వెళ్లిన తర్వాత అసలు వాళ్లకి ఏం తెలియదు. అలాగే మంచం మీద పడుకుని ఉంటారు. లేవలేరు, నిల్చోలేరు, కూర్చోలేరు. తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా అతనికి తెలియదు. ఎక్కువగా మధుమేహం, కాలేయం, మూత్రపిండాల వైఫల్యం, కార్డియాక్ అరెస్ట్, డ్రగ్స్, ఆల్కహాల్, విద్యుత్ షాక్, ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజురీ, బ్రెయిన్ ట్యూమర్ ఉన్నవారు కోమాలోకి వెళ్తారు. అయితే మహిళలు కోమాలోకి వెళ్తే వారి పునరుత్పత్తి వ్యవస్థ సరిగ్గా ఉంటేనే పీరియడ్స్ వస్తాయి. యాక్సిడెంట్ వల్ల వారి పునరుత్పత్తి వ్యవస్థకు ఏదైనా గాయం తగిలితే అది పని చేయదు. అప్పుడు పీరియడ్స్ రావు. అదే గాయం కాకుండా సరిగ్గానే ఉంటే కోమాలో ఉన్న తప్పకుండా పీరియడ్స్ వస్తాయి. ఎక్కువ మంది అమ్మాయిలు ఈరోజుల్లో థైరాయిడ్, పీసీఓఎస్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి సమస్యలు ఉన్నవారికి కూడా కోమాలో పీరియడ్స్ రావు. కోమాలో ఉన్నప్పుడు మహిళ మెదడు మాత్రమే పనిచేయదు. కానీ పునరుత్పత్తి అవయవాలు పని చేస్తూనే ఉంటాయి. కాబట్టి పీరియడ్స్ వస్తాయి. కోమాలో ఉన్న వ్యక్తి కేవలం మంచం మీద మాత్రమే పడుకుని ఉంటారు. కానీ వారికి మలవిసర్జన, మూత్రవిసర్జన వంటివి జరుగుతూనే ఉంటాయి. ఒక వ్యక్తి వినికిడి సామర్థ్యం, కదలికలను నియంత్రించే బాధ్యత అనేది మెదడుపై ఉంటుంది. వ్యక్తి కోమాలోకి వెళ్లినప్పుడు అపస్మారక స్థితిలో ఉంటాడు. అతని చేతులు, కాళ్లు కదలకుండా ఉంటాయి. వాళ్లు దేనిని కూడా ఫీల్ కాలేరు. ఏదీ వినలేరు, చూడలేరు. కానీ ఎప్పటిలాగే పీరియడ్స్ మాత్రం కంటిన్యూ అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.