apple : రోజుకు ఒక యాపిల్ పండు తింటే ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. దీని వల్ల ఎన్నో వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. అందుకే రోజుకో యాపిల్ తినండి అంటారు వైద్యులు. కొందరికి ఇష్టం ఉంటే మరి కొందరికి ఇష్టం ఉండదు. అయితే యాపిల్ తినకూడని వారు కూడా ఉన్నారు? అర్థం కాలేదా? అదేనండి. కొందరు యాపిల్ తినవద్దు. ఎందుకంటే యాపిల్ కొందరి ఆరోగ్యానికి హానికరం అంటున్నారు నిపుణులు. కావున.. యాపిల్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలతోపాటు.. దానివల్ల కలిగే దుష్ప్రభావాలు కూడా ఉన్నాయట.
యాపిల్‌లో విటమిన్ సి, పొటాషియం, డైటరీ ఫైబర్ లు ఉంటాయి. అంతేకాదు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు కూడా ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, ఇందులో క్వెర్సెటిన్, కాటెచిన్, క్లోరోజెనిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా లభిస్తాయి. ఇవి కణాలను దెబ్బతినకుండా రక్షిస్తాయి.
యాపిల్స్‌లో డైటరీ ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయం చేస్తుంది. ఇందులో ఉండే పాలీఫెనాల్ రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయం చేస్తుంది. తక్కువ కేలరీల కారణంగా, బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఎంపిక.
పెక్టిన్, ఒక రకమైన ప్రీబయోటిక్ ఫైబర్‌ను కలిగి ఉంటుంది. ఇది కడుపులోని మంచి బ్యాక్టీరియాను పోషించి.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. యాపిల్‌లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయం చేస్తాయి.
ఆపిల్ ఎవరు తినకూడదు.. తొక్క తింటే ఏమవుతుంది..?
కొంతమందికి యాపిల్ తినడం వల్ల అలర్జీ వస్తుంది అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఓరల్ అలర్జీ సిండ్రోమ్ ఉన్నవారు యాపిల్‌ను ఎక్కువగా తీసుకోవద్దు.. నోటిలో, గొంతులో, చర్మంలో దురద వస్తుంది. కొందరికి వాపు రావచ్చు. చాలా యాపిల్స్ శరీరానికి మంచివి కావు. ముఖ్యంగా దాని పై తొక్క తినడం వల్ల అపానవాయువు, గ్యాస్ లేదా కడుపు తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయి. అయితే యాపిల్స్ కొద్దిగా ఆమ్లంగా ఉంటాయి.. కాబట్టి ఎక్కువ యాపిల్ తినడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ అవుతుంది. అంతేకాదు కడుపు నొప్పి వచ్చే సమస్య కూడా ఉంది.
యాంటీబయాటిక్స్, యాంటిహిస్టామైన్లు, వంటి కొన్ని ఔషధాల శోషణకు యాపిల్ రసం ఆటంకం కలిగిస్తుంది అంటున్నారు నిపుణులు. ఇక ఆపిల్ తిన్న తర్వాత ముల్లంగి, పుల్లని పండ్లు, ఊరగాయలు తినవద్దు. యాపిల్ తోపాటు.. అనేక రకాల పండ్ల సాగుల్లో రసాయనాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో లభించే చాలా రకాల పండ్లలో కూడా రసాయనాలను ఉపయోగిస్తున్నారు. ఇలాంటి పండ్లు వాడటం వల్ల హానీకరం. అందుకే పండ్లను, కూరగాయలను తెచ్చిన వెంటనే శుభ్రంగా కడిగి తినడం చాలా మంచిది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు..