Diabetes In Children: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 530 మిలియన్ల మంది పెద్దలు మధుమేహంతో బాధపడుతున్నారట. అందులో 98 శాతం మంది టైప్-2 మధుమేహం తో ఇబ్బంది పడుతున్నారు. ఇక పిల్లలు కూడా టైప్ -1 మధుమేహం తో బాధపడుతున్నారు. సుమారుగా 650 వేల మంది పిల్లలు ఈ టైప్-1 మధుమేహం తో బాధపడుతున్నారని టాక్. శరీరం ఇన్సులిన్ హార్మోన్ ను ఉత్పత్తి చేయలేని స్థితిని టైప్ -1 మధుమేహం అంటారు. ఇక దీనితో ప్రతి లక్ష మంది పిల్లల్లో ముగ్గురు బాధ పడుతున్నారు.
టైప్ -1 డయాబెటిస్ ను ఎవరు నిరోధించలేరు కానీ టైప్-1 ను మాత్రం ఆహారాల ద్వారా నివారించవచ్చు. అనారోగ్యకరమైన జీవన శైలి, వ్యాయామం లేకపోవడం, ఆహారం, అధిక బరువు ఇవన్నీ కూడా టైప్-2 డయాబెటిస్ కు మూలకారణాలు. చిన్నప్పటి నుంచి క్యాలరీలు, షుగర్, ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే మధుమేహాన్ని అరికట్టడం కష్టమే. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో వైఫల్యం చెందితే పిల్లలకు హాని కలుగుతుంది అంటారు. ఇక యాపిల్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
ఇందులోనే విటమిన్ సి కూడా ఉంటుంది. ఇక యాపిల్ లోనే పాలీఫెనాల్స్ కూడా ఉంటాయి. అంటే ఇవి టైప్-2 డయాబెటిస్ ను నివారిస్తాయి. పిల్లల్లో మలబద్దకాన్ని తొలగించడానికి యాపిల్స్ ఎంతో ఉపయోగపడతాయి. ఇక మధుమేహం ఉన్నవారు స్వీట్లకు చాలా దూరంగా ఉండాల్సిందే. కానీ పిల్లల ఆహారంలో మాత్రం క్యారెట్లను చేర్చడం వల్ల ఎలాంటి హానీ ఉండదు. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీరికి మేలే. ఇక క్యారెట్ లలో పిండి పదార్థాలు ఉండవు కాబట్టి దీనిని తినవచ్చు.
తృణధాన్యాలు, ఓట్స్, బార్లీ, క్వినోవా, బ్రౌన్ రైస్ వంటివి పిండి పదార్థాలు ఉండే ఆహారాలు. ఇవి పిల్లలకు మేలు చేస్తాయి. ఇప్పటికే మధుమేహంతో బాధపడుతున్న పిల్లలకు తృణధాన్యాలను ఇవ్వవచ్చు. అందులో మొక్కజొన్న, పప్పు, బీన్స్, రాజ్మా, కాబూలీ చనా వంటివి ఇవ్వవచ్చు. ఇందులో ఖనిజాలు, విటమిన్లు ఫుల్ గా ఉంటాయి. అంతేకాదు చియా విత్తనాలలో ఆరోగ్యకరమైన ఆరోగ్యకరమైన విటమిన్లు, కొవ్వులు, ఫైబర్ లు ఉంటాయి.