Tea: టీ టీ టీ.. రోజు మొత్తంలో ఓ 4 సార్లు అయినా తాగుతారు చాలా మంది. ఛాయ్ లవర్స్ చాలా మందే ఉంటారండోయ్.. అందుకే ఉదయం లేచిన తర్వాత ఒకసారి ఆఫీస్ కు వెళ్ళిన తర్వాత ఒకసారి మళ్లీ మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం మరోసారి ఇలా నాలుగు సార్లు టీ తాగుతుంటారు. అయితే కొందరు టీ తాగవద్దు అంటారు. అంతేకాదు ఎండాకాలంలో అసలు టీ జోలికి పోవద్దు అంటారు. కానీ ఇందులో నిజం ఎంత అనేది మీకు తెలుసా?
టీ తాగకుండా ఉదయం గడవదు. సాయంత్రం గడవదు. టీ, కాఫీలు కచ్చితంగా ఉండాల్సిందే. మీలో కూడా చాలా మందికి ఇదే అలవాటు ఉండే ఉంటుంది. అయితే ఎండాకాలంలో టీ తాగడం వల్ల ఎలాంటి సమస్యలు రావట. కానీ అతి సర్వత్ర వర్జయేత్ అని మాత్రం గుర్తు పెట్టుకోండి. ఇదిలా ఉంటే టీ అంటే ఎంత అలవాటు ఉన్నా ఎండాకాలంలో కొందరు టీని తగ్గిస్తారు. వేసవిలో టీ తాగితే వేడి చేస్తుందని..చల్లటి డ్రింక్స్ ను మాత్రమే సేవిస్తారు.
టీ తాగడం వల్ల వేడి పెరగదు అట. కానీ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల మాత్రం కచ్చితంగా శరీరంలో వేడి పుడుతుందట. ఇక బయట ఉన్న ఉష్టోగ్రతలతో పోలిస్తే శరీరం చల్లబడ్డట్టుగా అనిపిస్తుందట. ఇక వేసవిలో చల్లటి పదార్థాల కంటే వేడి పదార్థాలు తీసుకోవడమే బెటర్ అంటున్నారు నిపుణులు.
ఎండాకాలంలో ఎండలో చల్లని పదార్థాలు తాగడం వల్ల ఎన్నో అనర్థాలు వస్తాయి. బాడీ వేడిగా ఉన్నప్పుడే చల్లటి పానీయాలు వెంటనే తీసుకోవద్దు అని గుర్తు పెట్టుకోండి. కానీ ఎండాకాలంలో కాస్త జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. మరీ ప్రధానంగా ఎండలో బయటకు వెళ్లాలి అంటే కచ్చితంగా ఆలోచించండి. అర్జెంట్ అయితే వెళ్ళండి. అప్పుడు కూడా మీతో గొడుగు ఉండేలా చూసుకోండి. లేదంటే వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంది.