Date Palm Benefits: ఖర్జూరాల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

ఖర్జూరంలో కూడా అధికంగా ఫైబర్ ఉంటుంది. ఇందులో మెగ్నీషియం, పొటాషియం, కాపర్, మాంగనీస్, విటమిన్ బి6, కె లు కూడా మిలితం అయి ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే ఖర్జూరంలో పోషక విలువలు అధికంగా ఉంటాయి.

Written By: Swathi, Updated On : May 26, 2024 1:02 pm

Date Palm Benefits

Follow us on

Date Palm Benefits: ఏ సీజన్ లో అయినా సరే మార్కెట్‌లో లభించే పండ్లలో ఖర్జూరం ఒకటి. ఎలాంటి రకం ఖర్జూరాలు తిన్నా కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే వీటిని ‘సూపర్ ఫుడ్’ అంటారు. ప్రతిరోజూ ఖర్జూరం తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయిఅంటున్నారు నిపుణులు. మరి ప్రతి రోజు ఖర్జూరం తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

ఖర్జూరంలో కూడా అధికంగా ఫైబర్ ఉంటుంది. ఇందులో మెగ్నీషియం, పొటాషియం, కాపర్, మాంగనీస్, విటమిన్ బి6, కె లు కూడా మిలితం అయి ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే ఖర్జూరంలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. ఖర్జూరం తినడం వల్ల ఫ్రక్టోజ్, సుక్రోజ్ వంటి చక్కెరలు శరీరానికి అందుతాయి. దీనివల్ల వెంటనే శరీరానికి శక్తి అందుతుంది. అందుకే మీరు ఎప్పుడైనా ఉపవాసం ఉంటే ఆ తర్వాత వెంటనే ఖర్జూరం తినండి.

ఖర్జూరాలు తినడం వల్ల పొట్టకు చాలా మంచి జరుగుతుంది. ఖర్జూరాలు జీర్ణక్రియలో తోడ్పడుతాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రభావ వంతంగా పని చేస్తాయి. పీచు పుష్కలంగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య కూడా దూరం అవుతుంది. అంతేకాదు ఈ ఖర్జూరాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి హృదయనాళ వ్యవస్థకు చాలా మేలు చేస్తాయి కర్జూరాలు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే శక్తి కూడా వీటికి ఉంటుంది.

ఖర్జూరంలో చక్కెర ఉంటుంది కానీ ఇవి రక్తంలో చక్కెరను పెంచవు. కానీ డయాబెడిస్‌ పేషెంట్లు వీటిని తీసుకోవాలి అనుకుంటే వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం. ఖర్జూరాలు మెదడు ఆరోగ్యాన్ని పెంచడానికి, మెదడు పనితీరును పెంచడంలో ఎంతో తోడ్పడుతాయి. సో మీ డైట్ లో రోజు ఖర్జూరాలను తీసుకోండి. కానీ ఒకసారి వైద్యులను సంప్రదించింది సలహా తీసుకోవడం బెటర్.