Elon Musk: మస్క్‌కు ఎదురుదెబ్బ.. వేతనంలో భారీగా కోత..!

ఎలాన్‌ మస్క తన అసాధారణమైన ప్రతిభతో టెస్లా మార్కెట్‌ విలువను 10 ఏళ్లలో అనూహ్యంగా పెంచారు. 2018లో తొలిసారి మార్కెట విలువ 650 బిలియన డాలర్లకు చేర్చారని బోర్డు డైరెక్టర్లు ఆయనపై ప్రశంసలు కురిపించారు.

Written By: Raj Shekar, Updated On : May 26, 2024 1:07 pm

Elon Musk

Follow us on

Elon Musk: ప్రపంచ కుబేరుడు.. టెస్లా కార్యల తయారీ సంస్థ సీఈవో ఎలాన్‌ మస్క్‌కు టెస్లా బోర్డు డైరెక్టర్లు షాక్‌ ఇచ్చారు. అతనికి ఇస్తున్న 55 బిలియన్‌ డాల్ల్ర(రూ.4.5 లక్షల కోట్ల) భారీ వేతన ప్యాకేజీ ఇవ్వొద్దని కోరినట్లు ప్రాక్సీ అడ్వయిజరీ సంస్థ గ్లాస్‌ లూయీస్‌ తెలిపింది. ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ గ్లాస్‌ లూయీస్‌ అనేది కార్పొరేట్‌ కంపెనీల్లో జరిగే కార్యకలాపాల్లో షేర్‌ హోల్డర్లకు సాయం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం టెస్లా షేర్‌ హోల్డర్ల తరఫున పని చేస్తుంది.

టెస్లా విలువ పెంచిన మస్క్‌..
ఎలాన్‌ మస్క తన అసాధారణమైన ప్రతిభతో టెస్లా మార్కెట్‌ విలువను 10 ఏళ్లలో అనూహ్యంగా పెంచారు. 2018లో తొలిసారి మార్కెట విలువ 650 బిలియన డాలర్లకు చేర్చారని బోర్డు డైరెక్టర్లు ఆయనపై ప్రశంసలు కరిపించారు. అంతేకాదు టెస్లా బోర్డు డైరెక్టర్లకు ఏడాదికి 55 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.4.5 లక్షల కోట్ల) భారీ వేతన ప్యాకేజీని అందిస్తూ ఆమోదం తెలిపారు. వేతనం అందించారు.

అంత వేదనం దండగని..
భారీ వేతనాన్ని వ్యతిరేకిస్తూ టెస్లా సీఈవో మస్క్, ఆ సంస్థ డైరెక్ల్రకు వ్యతిరేకంగా టెస్తా వాటాదార్లలో ఒకరైన రిచర్డ టొర్నెట్టా.. డెలావర్‌ కోర్టును ఆశ్రయించారు. ఇంత వేతనం ఇవ్వడం కార్పొరేట్‌ ఆస్తులను వృథా చేయడమే అని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ కేసు విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది. తాజాగా షేర్‌ హోడ్లర్లు, మస్క్‌కు అంత భారీ ప్యాకేజీ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ గ్లాస్‌ లూయీస్‌కు ప్రతిపాదనలు పంపారు. తాజాగా షేర్‌ హోల్డర్ల నిర్ణయంతో టెస్లాలో ఎలాంటి పరిణమాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

మస్క్‌ అనర్హుడే..
గతంలో టెస్లా షేర్‌ హోల్డర్‌ రిచర్‌ టోర్నెట్టా పిటిషన్‌పై డెలావర్‌ కోర్టు విచారణ చేపట్టింది. టెస్లా బోర్డు డైరెక్టర్లు నిర్ణయించిన భారీ వేతన ప్యాకేజీ అందుకునేందుకు ఎలాన్‌ మస్క్‌ అనర్హుడని డెలావర్‌ కోర్టు న్యాయమూర్తి కేథలీన్‌ మెక్‌కార్మిక్‌ ఆదేశాలిచ్చారు. అయితే, ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతుడైన పారిశ్రామికవేత్త, తన విలువైన సమయాన్ని కంపెనీ కోసం వెచ్చించాలనే ఉద్దేశంతో అంత మొత్తం చెల్లించామని టెస్లా డైరెక్టర్ల తరఫున న్యాయవాది కోర్టుకు వివరించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.