Allu Arjun Watch: అల్లు అరవింద్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనదైన రీతిలో అభిమానులను సొంతం చేసుకొని ఐకాన్ స్టార్ గా ఎదిగారు అల్లు అర్జున్. గంగోత్రి సినిమాతో హీరోగా సినీ ప్రయాణం ఆరంభించిన బన్నీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన బన్నీ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమాలు ఎన్నో ఉన్నా.. పుష్ప మాత్రం నంబర్ వన్ ప్లేస్ లో ఉంటుంది. ఇక డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించి మరో పార్ట్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దం అయింది.
అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ తో రెడీ అయింది. ఈ సినిమా ఆగస్ట్ లో థియేటర్ లలోకి రాబోతోంది. పుష్ప2 పేరుతో వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇండస్ట్రీలో స్టైలీష్, ఫ్యాషన్ సెన్స్‌కు అల్లు అర్జున్ కేరాఫ్ అడ్రస్ అని తెలిసిందే. అద్భుతమైన నటనతో వెండితెరపై అలరిస్తూ.. తనదైన మ్యానరిజంతో యూత్ ఫేవరేట్ ఐకాన్ స్టార్‌గా నిలుస్తుంటాడు. ఒక్కో సినిమాకు ఒక్కో మ్యానరిజం, స్టైల్ తో అలరిస్తుంటాడు బన్నీ.
రీసెంట్ గా టాలీవుడ్ దర్శకుల దినోత్సవ కార్యక్రమానికి బన్నీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో సింపుల్, స్టైలీష్ గా కనిపించారు ఈ స్టైలిష్ స్టార్. ముఖ్యంగా ఈ వేడుకలో బన్నీ ధరించిన పనేరై వాచ్ ఆకర్షణగా నిలిచింది. అయితే బన్నీ ధరించిన పనైరా వాచ్ ధర రూ. 3,97,431 అని తెలుస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు బన్నీకి వాచ్ లు అంటే చాలా ఆసక్తి ఉన్నట్టు ఉంది అంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే పుష్ప 2 పై ఇప్పటికే భారీ హైప్ నెలకున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఏ చిన్న అప్డేట్ వచ్చిన ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో రష్మిక మందన్నా, ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక సీక్వెల్ కు కూడా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది పుష్ప 2.