spot_img
Homeలైఫ్ స్టైల్Mobile Phone Side Effects: ఫోన్‌ పక్కన పెట్టుకుని పడుకోవడం ఎంత డేంజరో తెలుసా..?

Mobile Phone Side Effects: ఫోన్‌ పక్కన పెట్టుకుని పడుకోవడం ఎంత డేంజరో తెలుసా..?

Mobile Phone Side Effects: ఫోన్‌ చేతిలో లేకుంటే క్షణాన్ని కూడా యుగంలా గడిపే వారు చాలా మందే ఉన్నారు. అందులోనూ ఈ రోజుల్లో ఫోన్‌ లేని వారు లేరు కదా. ఆన్‌లైన్‌ క్లాసుల పేరిట స్కూల్‌ పిల్లలు కూడా ఫోన్లను వాడుతున్నారు. ఫోన్‌ ఒక్కటుంటే చాలు తిండి తిప్పలే కాదు.. ఇంట్లో ఎవరున్నారు.. ఎవరు లేరు అన్న విషయాన్ని కూడా పట్టించుకోనోళ్లు కూడా ఉన్నారు. స్మోర్ట్‌ ఫోన్‌ను అచ్చం చంటిపిల్లాడిలా చూసుకుని పక్కన పెట్టుకుని పడుకునేటోళ్లకు కొదవే లేదు. పొద్దంతా ఫోన్‌ను యూజ్‌ చేసి.. పడుకునే ముందు పక్కన పెట్టుకునే వారు చాలా మందే ఉన్నారు. కానీ ఇలా పడుకోవడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదంటున్నారు వైద్యులు, నిపుణులు.

యువత ఎక్కువగా..
యువకులు 90 శాతం, పెద్దలు 60 శాతం తమ తమ ఫోన్లను పక్కన పెట్టుకునే పడుకుంటున్నారని ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ నివేదికలో వెల్లడైంది. ఇక ఇలాంటి వారు నిద్రలేవగానే వాటినే చూస్తారు.
ఇలాంటి వారు ఉదయం యాక్టీవ్‌గా అస్సలు ఉండరట. బాగా అలసిపోయినట్టుగా, మూడీగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఫోన్‌ చూడటం వల్ల కూడా ఇలా అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
– నిద్రపోయే ముందు ఫోన్‌ చూడటం వల్ల తొందరగా నిద్రపట్టదు. ఫోన్‌ నుంచి వచ్చే బ్లూ లైటే ఇందుకు కారణం. ఈ ఫోన్‌ వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు, ఒత్తిడి, స్థూలకాయం, డిప్రెషన్‌ వంటి ఎన్నో ప్రమాదకరమైన సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

– ఫోన్‌ నుంచి ఆరోగ్యాన్ని పాడు చేసే రేడియేషన్‌ రిలీజ్‌ అవుతుంది. ఇలాంటి దాన్ని దగ్గరే పెట్టుకుని పడుకోవడం వల్ల మెదడు దెబ్బతింటుంది. ఈ రేడియేషన్‌ కండరాల నొప్పిని కలిగించడంతో పాటుగా తలనొప్పి కూడా వస్తుంది.

– అంగస్తంభన లోపానికి ఫోన్‌ నుంచి వచ్చే రేడియేషన్‌ కూడా ఒక కారణమే అంటున్నారు నిపుణులు. ఫోన్‌ను వచ్చే బ్లూ రేస్‌ నిద్ర రావడానికి సహాయపడే మెలటోనిన్‌ హార్మోన్‌ ఉత్పత్తి కాకుండా అడ్డుకుంటుంది. దీంతో నిద్రలేమి సమస్య ఎదురవుతుంది.

– నిద్రపోయే ముందు ఫోన్‌ వాడటం అస్సలు మంచిది కాదు. దీనివల్ల తెలియకుండానే ఎంతో సమయం గడిచిపోతుంది. నిద్రుండదు. కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. బ్రెయిన్‌ కూడా సరిగ్గా పనిచేయదు.

3 అడుగల దూరం ఉండాలి..
అందుకే పడుకునే ముందు ఫోన్‌ను మీకు 3 అడుగుల దూరంలో ఉంచండి. దీని ఎఫెక్ట్‌ మీపై తక్కువగా పడుతుంది. మరొక ముఖ్యమైన విషయం పడుకునే ముందు నోటిఫికేషన్లను చూడటం ఆఫ్‌ చేయండి. మొబైల్‌ డేటాను ఆఫ్‌ చేస్తే ఇంకా మంచిది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Pooja Hegde: హీరోయిన్ పూజా హెగ్డే కి క్షమాపణలు చెప్పిన ‘జన నాయగన్ ‘ డైరెక్టర్.. అసలు ఏమైందంటే..

Pooja Hegde: ఎన్నో అడ్డంకులను ఎదురుకొని , అసలు థియేటర్స్ లోకి వస్తుందా లేదా అనే సందిగ్ద పరిస్థితుల నడుమ , ఎట్టకేలకు అడ్డంకులను దాటుకొని రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ,...

TANA : ఛార్లెట్‌లో తానా సేవా స్పూర్తి.. 21 యూనిట్ల రక్తదానంతో 63 మందికి ప్రాణాధారం!

TANA : సేవా కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుండే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుంది. అమెరికాలోని ఛార్లెట్ నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్, 'సాయి అనుగ్రహ'...

Meher Ramesh Family Tragedy: మెహర్ రమేష్ ఇంట్లో తీవ్ర విషాదం.. హుటాహుటిన హాస్పిటల్ కి బయలుదేరిన పవన్...

Meher Ramesh Family Tragedy: రీసెంట్ గానే ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ తన కూతురు వివాహాన్ని ఎంత గ్రాండ్ గా జరిపించారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మెహర్ రమేష్ చిరంజీవి కుటుంబానికి...

Kiran Abbavaram: సంబరాల ఏటి గట్టు మూవీ కిరణ్ అబ్బవరం చేయాల్సిందా…ఎలా మిస్సయ్యింది…

Kiran Abbavaram: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. వాళ్ళు చేస్తున్న సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే మీడియం...

Balakrishna Injury: బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి పై డాక్టర్లు సంచలన ప్రకటన.. ఆందోళనలో ఫ్యాన్స్..

Balakrishna Injury: కాకినాడ లో గత కొద్దిరోజుల నుండి NBK111 విరామం లేకుండా షూటింగ్ జరుగుతుండగా, నిన్న ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్న సమయంలో బాలయ్య మోకాలికి గాయమైన...
Oktelugu Epaper
Exit mobile version