Calls on Silent Mode: ప్రస్తుత కాలంలో మొబైల్ లేకుండా ఏ పని ముందుకు సాగడం లేదు. విద్యార్థుల నుంచి ఉద్యోగం, వ్యాపారం చేసేవారు ప్రతి వ్యవహారం మొబైల్ తోనే నడిపిస్తున్నారు. అయితే మొబైల్ వల్ల అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. కమ్యూనికేషన్ వ్యవస్థలో మొబైల్ ప్రధానంగా ఉపయోగపడుతుంది అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఏదైనా అవసరం కోసం లేదా కాలక్షేపం కోసం మాట్లాడేందుకు మొబైల్ ప్రధానంగా నిలుస్తుంది. అయితే కొన్ని ముఖ్యమైన పనులతో బిజీగా ఉన్నా సమయంలో Spam కాల్స్ తో పాటు కొందరు కాలక్షేపం కోసం ఫోన్ చేస్తూ ఉంటారు. అయితే వీటిని అవాయిడ్ చేయడానికి ఫోన్ కట్ చేస్తూ ఉంటాం. అలాగే రాత్రి సమయంలో నిద్ర భంగం కలగకుండా ఉండడానికి సైలెంట్ లో పెడుతూ ఉంటాం. కానీ ఇదే సమయంలో కుటుంబ సభ్యుల నుంచి ఫోన్ కాల్స్ వస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే ఆ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు మొబైల్ లోనే ఆప్షన్ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుత కాలంలో పని ఒత్తిడి కారణంగా నిద్రలేమి ఎక్కువగా అవుతుంది. దీంతో ఒక్కోసారి చాలా ఆలస్యంగా నిద్రపోయి ఆలస్యంగా లేవాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో నిద్ర భంగం కలగకుండా ఉండడానికి మొబైల్ ను సైలెంట్ లో పెట్టి నిద్రపోతూ ఉంటారు. కానీ కుటుంబ సభ్యుల నుంచి ఫోన్ కాల్స్ వస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే ఓన్లీ ఎమర్జెన్సీ కాల్స్ ను సెట్ చేసుకోవడానికి మొబైల్లో ఒక ఆప్షన్ ఉందన్న విషయం చాలామందికి తెలియదు. అంటే ముఖ్యమైన వారు ఫోన్ చేస్తే మాత్రమే రింగ్ అయ్యే విధంగా మొబైల్లో సెట్ చేసుకోవచ్చు.
ఆండ్రాయిడ్ ఫోన్ కలిగి ఉన్నవారు ఈ సెట్టింగ్స్ చేసుకోవాలని అనుకుంటే. ముందుగా కాంటాక్ట్స్ అనే ఆప్షన్ లోకి వెళ్ళాలి. ఇందులో ఉదాహరణకు అమ్మ ఫోన్ నెంబర్ ఉంటే.. ఈ నెంబర్ ఓపెన్ చేయగానే పైన స్టార్ ఆప్షన్ కనిపిస్తుంది. దీనిని ప్రెస్ చేయాలి. ఇలా నాన్న లేదా భార్య సంబంధించిన మొబైల్ నెంబర్లకు సెట్ చేసుకోవచ్చు. ఇవి ఫేవరెట్ కాల్స్ అయిపోతాయి. ఆ తర్వాత ఎమర్జెన్సీ కాల్స్ అనే ఆప్షన్ లోకి వెళ్లాలి. ఇక్కడ Do Not Disturb అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులోకి వెళ్లిన తర్వాత కాల్స్ లిస్టు ఓపెన్ అవుతుంది. ఇందులో ఫేవరెట్ ఫోన్ నెంబర్లు మాత్రమే సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు డిస్టర్బ్ చేయొద్దు అని అనుకునే సమయంలో కేవలం ముఖ్యమైన నెంబర్లు మాత్రమే కాల్స్ వచ్చినప్పుడు రింగ్ అవుతు ఉంటాయి. మిగతా నెంబర్లు కాల్స్ వచ్చిన సైలెంట్ గా ఉండిపోతాయి.
ఇదే సెట్టింగ్స్ ఆపిల్ ఫోన్ వారు అయితే నచ్చిన ఫోన్ నెంబర్ పై క్లిక్ చేయగానే అందులో కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిలో ఎడిట్లోకి వెళ్ళగా.. అందులో బైపాస్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిని ఆన్ చేసుకోవడం ద్వారా ఓన్లీ ముఖ్యమైన కాల్స్ మాత్రమే రింగ్ అవుతూ ఉంటాయి. ఇలా అత్యవసర మొబైల్ నెంబర్లు రింగ్ అయ్యేవిధంగా సెట్ చేసుకోవచ్చు.