Health Tips (9)
Health Tips: రాత్రి పడుకునే ముందు మొబైల్ కు గుడ్ నైట్ చెప్పి పడుకుంటారు. లేదా దాన్ని పైన పెట్టుకునే పడుకుంటారు. ఇక కొందరు లేవగానే దానికే గుడ్ మార్నింగ్ చెప్పి లేస్తారు. లేవగానే ముందు ఫోన్ మొహం చూడాలి. మీరు కూడా ఇలాగే చేస్తున్నారా? అయితే మీరు చాలా పెద్ద ప్రమాదంలో పడుతున్నారు అని అర్థం. మరి ఈ ఫోన్ ను కాకుండా ముందు వేరే కొన్ని పనులు చేయాలి. అవేంటంటే? ఉదయం లేవగానే వెంటనే మొబైల్ పట్టుకోకుండా కొన్ని నిమిషాలు మిమ్మల్ని మీరు రిలాక్స్‌గా చేసుకోండి. ఇలా చేస్తే మీ ఉత్పాదకత రోజంతా ఎంత పెరుగుతుందో ఊహించుకోండి. ఇంతకీ ఏం చేయాలంటే?
Also Read: బట్టతల, జుట్టు రాలకుండా ఉండాలంటే.. ఇవి రెగ్యులర్ గా తింటూ ఉండాలి.. అవేంటంటే?
ముందుగా కళ్లు తెరవగానే దేవుడికి థాంక్స్ చెప్పేయండి. అయితే దగ్గర ఉన్నవాటిని అభినందించే అలవాటు చాలా మందికి ఉండదు కదా. రోజంతా ప్రతికూల విషయాలపై దృష్టి పెట్టరు కూడా. కానీ ఉదయం నిద్రలేచిన వెంటనే మీ జీవితంలోని మంచి విషయాల గురించి 2 నిమిషాలు ఆలోచించాలి. దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. సో మీరు పాజిటివ్ ఎనర్జీతో డేను మొదలు పెట్టబోతున్నారు అన్నమాట.
మీరు ఉదయం నిద్రలేవగానే, మిమ్మల్ని సంతోషపరిచే 3 విషయాలకు మీ మనసులో కృతజ్ఞతలు చెప్పండి. కావాలంటే బయటకు చెప్పండి. లేదా డైరీలో రాసుకోండి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి లేకుండా, ఉత్సాహంగా ఉంటారు.
రాత్రిపూట పడుకున్న తర్వాత శరీరం డీహైడ్రేషన్ అవుతుంది. కాబట్టి మేల్కొన్న తర్వాత ముందుగా నీరు తాగాలి. ఇలా చేయడం వల్ల మీ జీవక్రియను పెరుగుతుంది. కడుపుని క్లియర్ అవుతుంది.
ఒక గ్లాసు గోరువెచ్చని నీరు లేదా నిమ్మకాయ నీరు తీసుకోండి. కాస్త తేనె లేదా పసుపు యాడ్ చేసి కూడా తాగవచ్చు. ఉదయం సూర్యరశ్మి, స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవాలి. ఇలా చేస్తే శరీరంలో ‘హ్యాపీ హార్మోన్’ సెరోటోనిన్ స్థాయి పెరుగుతుంది. తద్వారా మానసిక స్థితి మెరుగు అవుతుంది. అలాగే, లోతైన శ్వాస తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు ఎక్కువ ఆక్సిజన్‌ను గ్రహిస్తాయి. దీని వల్ల మనస్సు తాజాగా, చురుగ్గా ఉంటుంది.
ఎలా చేయాలి?
ఉదయం నిద్రలేచిన తర్వాత, బాల్కనీ లేదా టెర్రస్‌కి వెళ్లి కొన్ని నిమిషాలు సూర్యకాంతిలో నిలబడండి. లోతైన శ్వాస తీసుకొని నెమ్మదిగా గాలిని వదిలేయండి. ఇలా చేయడం వల్ల మీ మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. లైట్ స్ట్రెచింగ్ లేదా యోగా చేయండి. శరీరాన్ని ఉత్తేజపరిచేందుకు ఉదయం తేలికపాటి వ్యాయామం చాలా మంచిది. రక్త ప్రసరణ పెరుగుతుంది. కండరాలు విశ్రాంతి పొందుతాయి. మీరు రోజంతా అలసిపోయినట్లు అనిపించదు.
ఎలా చేయాలి?
కేవలం 5-10 నిమిషాలు వ్యాయామం చేయండి. సూర్య నమస్కారం లేదా తేలికపాటి యోగా చేయండి. ఇలా చేయడం వల్ల శరీరం తేలికగా ఉంటుంది. రోజంతా శక్తి వస్తుంది. ఉదయం స్ఫూర్తిదాయకమైన ఆలోచనలు మీ డేను బెటర్ గా ఉండేలా చేస్తాయి. పాజిటివ్ వినండి. మాట్లాడండి. ఒక మంచి ప్రేరణ పొందే పుస్తకం చదవండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ట్రెండింగ్ తెలుగు వెబ్ సైట్ ఈ విషయాన్ని నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.
Also Read: లైఫ్‌లో హ్యాపీనెస్ ఉండాలంటే.. ఈ చిన్న మార్పులు చేయండిలా!