Stimulates Brain : మనిషి జీవితం కాలం పెరిగే కొద్దీ ఆయస్సు తగ్గుతుంది. దీంతో రక్త ప్రసరణ తగ్గి కొన్ని అవయవాలు పనిచేయకుండా పోతాయి. వీటిలో మెదడు కూడా ఒకటి. యవ్వనంలో ఉన్న ఉత్సాహం వయసు తగ్గే కొద్ది తగ్గుతుంది. అయితే మద్యపానం, ఇతర వ్యసనాల వల్ల మెదడుపై ప్రభావం పడి వృద్ధాప్యం రాకుండానే కొందరు ఆల్జీమర్స్ వ్యాధికి గురవుతారు.ఇలా ప్రతిదానికి మరిచిపోయేవారు తమ విధుల్లో, ఇతర కార్యకలాపాల్లో నష్టపోతుంటారు. దీంతో వారికి ఏం చేయాలో అర్థం కాదు. అయితే కొన్ని రకాల వ్యసనాలకు దూరంగా ఉంటూ ప్రత్యేకంగా కొన్ని వ్యాయామాలు చేయడం వల్ల మెదడు ఎప్పుడు ఉత్సాహంగా ఉంటుంది. ఈ వ్యాయామం మెదడుకు సంబంధించినది అయితే మరింత ప్రయోజనం ఉంటుంది. మరి మెదడు చేసే ఎలాంటి వ్యాయామాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయో ఇప్పుడు చూద్దాం..
డైరి రాయడం..
ప్రస్తుతం ఉద్యోగులు, వ్యాపారులు ప్రతీ పనికి మొబైల్ యూజ్ చేస్తున్నారు. ఏదైనా పద్దులు రాసుకోవాలన్నా కంప్యూటర్ ను ఉపయోగిస్తున్నారు. అయితే సమయం లేకపోవడం వల్ల ఇస్తున్నారు. కానీ కొన్ని చిన్ని చిన్న విషయాలను చేతితో డైరీలో రాసుకోవడం మంచిది. ఉద్యోగం, వ్యాపారం కోసం కాకపోయినా తమ జీవితంలో ఆరోజు ఏం చేశారో డైరిలో రాసుకోవడం వల్ల సంతృప్తి పొందుతారు. దీంతో మనసు ప్రశాంతంగా ఉండి మెదడు సక్రమంగా పనిచేస్తుంది.
కొత్త విషయాలను నేర్చుకోవడం..
కొందరికి కొత్త విషయాలు నేర్చుకోవడం ఆసక్తిగా ఉంటుంది. కానీ మరికొందరు మనకెందుకు లే.. అన్నట్లుగా ఉంటారు. ఇలా కాకుండా డైలీ పేపర్ చదవడం, న్యూస్ వినడం అలవాటు చేసుకోవాలి. మనసుకు ప్రశాంతం అనిపించే వీడియోలు చూడొచ్చు. అందువల్ల అప్డేట్ విషయాలను నేర్చుకోవడం వల్ల మెదడుకు వ్యాయామం చేసినట్లు అవుతుంది.
సంగీతం వినడం..
సంగీతానికి వస్తువులే కదులుతాయంటారు. మెదడుకు కూడా సంగీతంతో ప్రభావం అవుతుంది. ఆ విషయాన్ని వైద్యలు కూడా ధ్రువీకరించారు. అందువల్ల ప్రతిరోజూ ఆధ్యాత్మికం, సినిమాలు, ఇతర ఏ పాటలు అయినా మీ మనసుకు నచ్చుతాయని అనేవి కచ్చితంగా వినాలి. ఇలా ప్రతిరోజూ ఏదో ఒక మనసుకు నచ్చే మ్యూజిక్ ను వినడం అలవాటు చేసుకోవాలి.
మెడిటేషన్ ప్రతిరోజూ..
మెడిటేషన్ పేరు చెప్పగానే చేస్తాం.. అంటారు.కానీ పట్టించుకోరు. కానీ ప్రతిరోజూ కనీసం ఒక గంట పాటు మెడిటేషన్ చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇది ప్రతిరోజూ చేయడం వల్ల బద్దకాన్ని వీడుతారు. దీంతో కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. మెదడు చురుగ్గా ఉంటుంది. మెదడు చురుగ్గా ఉండడం వల్ల ఏ పని అయినా ఈజీగా చేయగలగుతారు.
ఒత్తిడికి దూరంగా..
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒత్తిడిని కలిగి ఉంటున్నారు. సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉండడం మంచింది. అంటే అనవసరపు విషయాలపై పెద్దగా ఆలోచించడం. ఉపయోగపడని వాటి గురించి వెతకడం వంటికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా మొబైల్ లో అనవసరపు సమాచారం, వీడియోల కోసం వెతకకుండా మొబైల్ ను ఎక్కువ సేపు చూడకుండా ఉండాలి. దీంతో ఒత్తిడి తగ్గుతుంది.