https://oktelugu.com/

Graham Thorpe: రైలు ముందుకెళ్లి స్టార్ క్రికెటర్ ఆత్మహత్య

ఇందులో దాచడానికి ఏదీ లేదని" ఆమె వ్యాఖ్యానించింది. తండ్రి మరణం తమను తీవ్రంగా కుంగతీసిందని ఆమె ఉద్వేగంగా వ్యాఖ్యానించింది. జాతీయ మీడియాతో తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని పంచుకుంది. కిట్టి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 13, 2024 / 10:05 PM IST

    Graham Thorpe

    Follow us on

    Graham Thorpe: ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్ గా గ్రాహం ధోర్ప్ కు అద్భుతమైన పేరు ఉంది. 1993- 2005 మధ్య ఇంగ్లాండ్ దేశం తరఫున 100 టెస్టులు ఆడాడు. 82 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టులలో 44.66 సగటుతో 16 సెంచరీలు చేశాడు. ఏకంగా 6,744 రన్స్ సాధించాడు. ఎడమ చేతివాటం బ్యాటింగ్ తో గ్రాహం ధోర్ప్ అలరించేవాడు. వన్డేలలో 37.18 సగటుతో 21 హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 2,380 రన్స్ చేశాడు. ఇంగ్లాండ్ మాత్రమే కాదు, సర్రే జట్టు తరఫున 17 సంవత్సరాలు ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 214 మ్యాచులు, 271 లిస్ట్ – ఏ గేమ్ లలో పాలుపంచుకున్నాడు. కౌంటీ తరఫున ఏకంగా 20,000 కంటే ఎక్కువ రన్స్ చేశాడు.

    సహజమరణం కాదట..

    ఇంగ్లాండ్ జట్టుకు దిగ్గజ ఆటగాడిగా సేవలందించిన గ్రాహం ధోర్ప్ .. ఈనెల 5న మరణించాడని వార్తలు వినిపించాయి. అయితే అతని మరణానికి అనారోగ్య కారణానికి కారణమని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అతని మరణం పట్ల యావత్ క్రికెట్ ప్రపంచం ఆవేదన వ్యక్తం చేసింది. అతని మరణానికి సంతాపం తెలుపుతూ, కుటుంబానికి సానుభూతి ప్రకటించింది. అయితే అతడు మరణించిన ఎనిమిది రోజుల తర్వాత.. అసలు విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీంతో యావత్ క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఎందుకంటే గ్రాహం ధోర్ప్ ది సహజ మరణం కాదట. ఇదే విషయాన్ని ఆయన సతీమణి అమండా వెల్లడించారు.

    గ్రాహం సతీమణి ఏమన్నదంటే

    ” గ్రాహం ధోర్ప్ మానసిక సమస్యలతో బాధపడ్డారు. చాలా కాలం పాటు ఆత్మ న్యూనత తో బాధపడ్డారు. ఆయన అనారోగ్య సమస్యలు మా కుటుంబానికి ఇబ్బందిగా మారతాయని భావించారు. అందువల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టలేక.. ఎంతగానో ప్రేమించే నేను, నా ఇద్దరి కూతుళ్లు ఉన్నప్పటికీ.. ఆయన తన మానసిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడలేకపోయారు. చనిపోతేనే తన బాధలకు పరిష్కారం ఉంటుందని భావించారు. అందువల్లే కదిలే రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆగస్టు 4న ఈ ఘటన జరిగింది. తీవ్ర గాయాల పాలైన అతడిని ఆసుపత్రి తరలించాం. చికిత్స పొందుతూ అతడు ఆగస్టు ఐదున చనిపోయాడు. మానసిక సమస్యలతో బాధపడుతున్న అతడు రెండు సంవత్సరాల క్రితం కూడా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడని” ఆయన భార్య అమండా వెల్లడించింది.

    శోకసంద్రంలో మునిగిపోయింది

    గ్రహం ధోర్ప్ మరణాన్ని సహజం అని భావించిన క్రీడాలోకం.. ఆ తర్వాత అసలు విషయం తెలియడంతో శోక సంద్రంలో మునిగిపోయింది. మరోవైపు గ్రాహం ధోర్ప్ మరణం పట్ల అతని కూతురు కిట్టి ఉద్వేగంగా వ్యాఖ్యానించింది..” నాన్న మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. మేము ఎంతగానో చెప్పి చూసినప్పటికీ ఆయన లో మార్పు రాలేదు. ఇందులో దాచడానికి ఏదీ లేదని” ఆమె వ్యాఖ్యానించింది. తండ్రి మరణం తమను తీవ్రంగా కుంగతీసిందని ఆమె ఉద్వేగంగా వ్యాఖ్యానించింది. జాతీయ మీడియాతో తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని పంచుకుంది. కిట్టి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.