https://oktelugu.com/

Rainy season : వర్షాకాలంలో జుట్టును సంరక్షించుకోవడం ఎలా?

వర్షాకాలంలో జుట్టు రాలిపోవడం సాధారణమే. ఏకధాటిగా కురిసే వర్షాల వల్ల తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల జుట్టు పెలుసుగా మారి.. జుట్టు రాలడానికి కారణమవుతుంది. జుట్టు తేమగా ఉన్నాసరే కొందరు ఆయిల్ అప్లై చేస్తారు. దీంతో చుండ్రు బాగా ఏర్పడి చిరాకు, దురద వంటివి కలిగిస్తాయి. అధిక తేమ ఫంగల్ ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : August 13, 2024 / 11:12 PM IST

    During the rainy season

    Follow us on

    Rainy season : మారుతున్న జీవనశైలి మాత్రమే కాకుండా వాతావరణ పరిస్థితుల వల్ల కూడా చాలామందికి జుట్టు అధికంగా రాలుతోంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువగా ఎయిర్‌ఫాల్ అవుతుంది. దీనికి చెక్ పెట్టాలని కొందరు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అయిన జుట్టు రాలిపోవడం తగ్గకుండా ఇంకా ఇతర సమస్యలు కూడా వస్తాయి. ఈ వర్షాకాలంలో జుట్టు ఎందుకు ఎక్కువగా రాలుతోంది. మరి మీ జుట్టును సంరక్షించుకోవడం ఎలాగో ఈ స్టోరీలో చూద్దాం.

    వర్షాకాలంలో జుట్టు రాలిపోవడం సాధారణమే. ఏకధాటిగా కురిసే వర్షాల వల్ల తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల జుట్టు పెలుసుగా మారి.. జుట్టు రాలడానికి కారణమవుతుంది. జుట్టు తేమగా ఉన్నాసరే కొందరు ఆయిల్ అప్లై చేస్తారు. దీంతో చుండ్రు బాగా ఏర్పడి చిరాకు, దురద వంటివి కలిగిస్తాయి. అధిక తేమ ఫంగల్ ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది. ఇది జుట్టు కుదుళ్ల నుంచి బలహీనం చేసి జుట్టు కోల్పోయేలా చేస్తుంది. ఎంత జాగ్రత్తగా ఉన్నాసరే వర్షంలో కొన్నిసార్లు తడిచిపోతాం. దీంతో జుట్టు అంతా తేమ అయి విరిగిపోతుంది. అయితే మీకు రోగనిరోధకశక్తి తక్కువగ ఉండటం లేదా జుట్టుకు ముందు నుంచే సరైన పోషకాలు అందకపోవడం వల్ల కూడా వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా రాలుతుంది.

    ఈ వర్షాకాలంలో జట్టు రాలకుండా ఈ చిట్కాలు పాటిస్తే కేశాలను సంరక్షించుకోవచ్చు. వర్షంలో తడిచిన వెంటనే జుట్టుకు తలస్నానం చేయాలి. లేకపోతే తేమ వల్ల ఫంగస్ తయారవుతుంది. కొందరు తొందరపడి జుట్టు ఆరకుండా దువ్వుతారు. ఇలా ఎక్కువసేపు జుట్టు తడిగా ఉంటే కురులు తొందరగా రాలిపోతాయి. రసాయనాలు ఉండే క్రీములు, హెయిర్ స్ప్రేల వాడకం తగ్గించాలి. వీటివల్ల జుట్టు మంచిగా ఉందని మీరు అనుకుంటారు. కానీ జుట్టు రాలిపోవడానికి ఇది ఒక ముఖ్యమైన కారణం. కొందరు బిగుతుగా జడ వేసుకుంటారు. దీనివల్ల జుట్టు కుదుళ్లకు తీవ్ర ఒత్తిడి కలిగి పుండ్లు వచ్చేలా చేస్తుంది. కాబట్టి జడ వేసుకొనేటప్పుడు వదులుగా ఉండేలా చూసుకోవాలి. ఒత్తిడి, ఆందోళన కారణంగా కూడా జుట్టు ఎక్కువగా రాలుతుంది. సో ఎన్ని టెన్షన్‌లు ఉన్నా కూడా ఒత్తిడికి గురికాకుండా ఉండండి.

    జట్టు ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే దానిని సంరక్షించడానికి చిట్కాలు పాటిస్తే సరిపోద్ది అనుకోవద్దు. ఎందుకంటే కురులు విషయంలో కేరింగ్ ఎంత ముఖ్యమో.. మీరు తీసుకునే ఫుడ్ కూడా అంతే ముఖ్యం.
    పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. పాలకూర, బచ్చలికూర, క్యారెట్, బీట్‌రూట్, బాదం, చేపలు, గుడ్లు వంటి పదార్థాలు తీసుకోవాలి. వీటిలో ఉండే పోషకాలు జుట్టు దృఢంగా ఉండటంతో పాటు రాలకుండా కాపాడతాయి. చాలామంది ఈ రోజుల్లో ఆయిల్‌ జిడ్డుతో బయటకు వెళ్లలేక ప్రతిరోజు తలస్నానం చేస్తారు. ఇలా చేయడం వల్ల జుట్టు తొందరగా రాలిపోతుంది. కనీసం వారానికి రెండు నుంచి మూడుసార్లు మాత్రమే చేయాలి. అంతకంటే ఎక్కువగా తలస్నానం చేయడం వల్ల జుట్టు డ్యామేజ్ అవుతుంది.