Homeలైఫ్ స్టైల్Daily Intense Exercise Benefits: ప్రతిరోజు ఈ రకమైన వ్యాయామం చేస్తే.. వ్యాధులు రమ్మన్నా రావు..

Daily Intense Exercise Benefits: ప్రతిరోజు ఈ రకమైన వ్యాయామం చేస్తే.. వ్యాధులు రమ్మన్నా రావు..

Daily Intense Exercise Benefits: ఆరోగ్యానికి కాపాడుకునేందుకు ప్రస్తుత కాలంలో వ్యాయామం చాలా అవసరం. అయితే రాత్రులు ఎక్కువసేపు మేరకుతో ఉండడంతో పాటు.. ఉదయం ఆలస్యంగా నిద్రలేచిన వారు వ్యాయామం చేయడానికి పెద్దగా ఇష్టపడడం లేదు. అంతేకాకుండా వ్యాయామం చేసినా కూడా కాళ్లు కలపడం తప్ప శరీరానికి ఏమాత్రం సినిమా చేకూర్చడం లేదు. దీంతో గంటల తరబడి వ్యాయామం చేసినా కూడా పెద్దగా ఫలితం ఉండడం లేదు. ఇలా వ్యాయామం గంటలకొద్దీ చేసిన వారిపై.. తక్కువసేపైనా కాస్త శరీరానికి అలసట కలిగించే వ్యాయామం చేసిన వారిపై పరిశోధన నిర్వహించారు. దీంతో ఎక్కువసేపు సాధారణ వ్యాయామం చేసే వారి కన్నా.. తక్కువసేపు కాస్త అలిష్ట కలిగిన వ్యాయామం చేసిన వారిలోనే వ్యాధులు తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఇంతకీ ఈ పరిశోధనలు ఎవరు చేశారు? ఆ వివరాలు ఏంటి?

యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ ఆధ్వర్యంలో ప్రపంచంలోని ముఖ్యమైన పరిశోధకులు సహాయంతో వ్యాయామం దాని ప్రభావం అనే అంశంపై పరిశోధనలు నిర్వహించారు. ఈ పరిశోధనలో భాగంగా 35 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు 96,000 మందిని ఎంచుకున్నారు. వీరిలో ప్రతిరోజు 25 నిమిషాల పాటు శారీరక శ్రమను ఎక్కువగా కలిగించి చెమటలు కక్కే విధంగా వ్యాయామం చేసిన వారిలో 63% డిమెన్షియా, 60 శాతం డయాబెటిస్ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా 40% వీరిలో మరణాలు కూడా తగ్గినట్లు తేల్చారు. అంతేకాకుండా ఈ రకమైన వ్యాయామం కేవలం ఇప్పుడు మాత్రమే కాకుండా వృద్ధాప్యంలోనూ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు.

ప్రతిరోజు కనీసం 25 నిమిషాల పాటు గుండె వేగంగా కొట్టుకునే విధంగా.. శ్వాస ఉక్కిరిబిక్కిరి అయ్యేలా వ్యాయామం తప్పనిసరిగా చేయాలని ఈ వైద్యులు సూచిస్తున్నారు. సాధారణ వ్యాయామం ఎంత చేసినా కూడా ఎలాంటి ఉపయోగం ఉండదని పేర్కొంటున్నారు. అంతేకాకుండా గుండె సమస్యలు ఉన్నవారు సైతం సాధారణ వ్యాయామం కాకుండా కాస్త వేగం పెంచాలని.. కనీసం గంట పాటు అయినా శ్రమ ఎక్కువగా కలిగించేలా చేయాలని అంటున్నారు. ఇలాంటి వ్యాయామం చేయని పక్షంలో వ్యాధులు ఎక్కువగా ప్రభలే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాకుండా అలసటతోపాటు, మతిమరుపు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. వీటికి తోడు సరైన ఆహారం లేకపోవడం వల్ల చిన్న వయసులోనే అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో కల్తీ ఆహారం ఉండడం వల్ల ఈ రకమైన వ్యాయామం తప్పనిసరిగా చేయాలని అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular